బాబోయ్…వీధిలో నడిరాత్రిలో…పోలీసు స్టేషన్ ముందే… చిరుత.
ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ్ టౌన్ లో ఆ రాత్రి ఏం జరిగింది ? మరేం లేదు.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నింపాదిగా వెళ్తున్నాయి కొన్ని పశువులు.. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో.. ఓ చిరుత అక్కడ ప్రత్యక్షమైంది. అంతే.. దాన్ని..
ఉత్తరాఖండ్ లోని దేవప్రయాగ్ టౌన్ లో ఆ రాత్రి ఏం జరిగింది ? మరేం లేదు.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నింపాదిగా వెళ్తున్నాయి కొన్ని పశువులు.. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో.. ఓ చిరుత అక్కడ ప్రత్యక్షమైంది. అంతే.. దాన్ని చూడగానే పశువులన్నీ పరుగో పరుగు ! ఆ వీధిలోనే ఉన్న ఓ పోలీసు స్టేషన్ నుంచి ఓ పోలీసు తలుపు తీసుకుని బయటకు రాబోయాడు. లైట్ల వెలుగులో ఆ చిరుతను చూసి బేర్ మంటూ మళ్ళీ పోలీసు స్టేషన్ లోకి పారిపోయాడు. వైభవ్ సింగ్ అనే అటవీ అధికారి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. దేవ ప్రయాగ్ వీధుల్లో చిరుత ‘పోలీసింగ్’ చేస్తోంది’ అని కామెంట్ పెట్టారు. మొత్తానికి సీసీటీవీ పుణ్యమా అని నడిరోడ్డులో చిరుతపులి దృశ్యం రికార్డయింది.
A new cop policing the streets of Devprayag….
CCTV footage of the Police station. Shared by colleague @VaibhavSinghIFS. pic.twitter.com/a3xzjyIvE4
— Susanta Nanda IFS (@susantananda3) July 23, 2020