తప్పుడు వివాహ వాగ్దానం నేరం, కానీ సహజీవనాన్ని అత్యాచారంగా భావించలేం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు..

సహజీవన కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పు చెప్పింది. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత, పురుషుడిపై..

తప్పుడు వివాహ వాగ్దానం నేరం, కానీ సహజీవనాన్ని అత్యాచారంగా భావించలేం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీం కోర్టు..
Follow us

|

Updated on: Mar 01, 2021 | 9:14 PM

సహజీవన కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ కీలక వాఖ్యలు చేసింది. గత కొంతకాలం సహజీవనం చేసిన తరువాత, పురుషుడిపై స్త్రీలు అత్యాచారం కేసులు పెడుతున్న తరుణంలో, ఓ మహిళ చేసే అంగీకార సహజీవనాన్ని అత్యాచారంగా భావించలేమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎస్ఏ బాబ్డే వ్యాఖ్యానించారు.

ఓ పురుషుడితో ఆర్థిక అవసరాల కోసం లేదా శారీరక సుఖం కోసం సంబంధం ఏర్పరచుకుంటే అత్యాచారం కిందకు రాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. సదరు కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న నిందితుడు, మహిళ(కేసు పెట్టిన వ్యక్తి) రెండేళ్లుగా సహజీవనం చేశారు. ఎప్పుడైతే.. నిందితుడు వేరొక మహిళను పెళ్ళాడాడో.. అప్పుడు ఆ మహిళ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ జంట రెండేళ్లుగా రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ ఆ మహిళ మాత్రం వివాహం వరకు లైంగిక సంబంధానికి నిరాకరించింది. ఇదిలా ఉంటే వాదనల సమయంలో మహిళ తరపు న్యాయవాది ఆదిత్య వశిష్త్నాథ్, ఫిబ్రవరి 2014 నుండి నిందితుడు తమ క్లయింట్‌తో మోసపూరితమైన బంధాన్ని కొనసాగించాడని సుప్రీం కోర్టుకు నివేదించారు. ఈ జంట మనాలికి వెళ్లి అక్కడ “హిడింబా ఆలయంలో వివాహం చేసుకున్నారని” పేర్కొన్నారు. అయితే, నిందితుడు వివాహానికి సంబంధించిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు..రెండేళ్ల పాటు తాము సహజీవనంలో ఉన్నామని స్పష్టం చేశాడు. కానీ, మహిళ మాత్రం వివాహం అనే అబద్దపు బంధం ద్వారా నిందితుడు తనను లోబరుచుకున్నాడని కోర్టుకు విన్నవించింది.

ఈకేసుకు సంబంధించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..  “వివాహం గురించి తప్పుడు వాగ్దానాలు చేయడం నేరం. వివాహం, విడిపోవడం విషయాల్లో ఎవరూ తప్పుగా వాగ్దానం చేయకూడదు, కానీ లైంగిక సంబంధాన్ని అత్యాచారంగా పరిగణనలోకి తీసుకోలేమని” సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది

దీంతో నిందితుడు తనను దారుణంగా హింసించడమే కాకుండా గాయపరిచాడని.. అందువల్ల తాను ఆసుపత్రి పాలైనట్లు ఆ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా తన కాలు విరిగినట్లుగా కూడా పేర్కొంది. దీంతో  మహిళ చేసిన వ్యాఖ్యలు విన్న చీఫ్ జస్టిస్.. మీరు దాడి చేసినట్లుగా కేసు దాఖలు చేయాలని.. ఎందుకు అత్యాచారం కేసు పెట్టారని” ప్రశ్నించారు.

నాలుగు వారాల పాటు నిందితుడి నుంచి రక్షణ కల్పిస్తామని.. కానీ అతడిని మాత్రం అరెస్ట్ చేయాలేమని ధర్మాసనం వెల్లడించింది. అయితే, ఈకేసుకు సంబంధించిన  ఎఫ్ఐఆర్ రద్దు చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. “సాక్ష్యాలు సేకరించిన తరువాత ట్రయల్ కోర్టులో అప్పీలు చేసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..