Amritsar: ఫేస్ బుక్ లో ఫొటో పోస్ట్.. పదేళ్ల బాలుడిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వీటిని ఫన్నీగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు. కాదని కాంట్రవర్సీగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. తాజాగా..

Amritsar: ఫేస్ బుక్ లో ఫొటో పోస్ట్.. పదేళ్ల బాలుడిపై కేసు నమోదు.. కారణం ఏంటంటే..
Case Filed On Boy
Follow us

|

Updated on: Nov 26, 2022 | 7:10 AM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వీటిని ఫన్నీగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు. కాదని కాంట్రవర్సీగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. తాజాగా పంజాబ్ లోని అమృత్ సర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. తుపాకీ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతోఅమృత్‌సర్ రూరల్ పోలీసులు 10 ఏళ్ల బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అతని తండ్రితో సహా నలుగురి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. అయితే విచారణ జరిపిన సమయంలో ఆ తుపాకీ డమ్మీ అని తేలడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ ను రద్దు చేశారు. బాలుడి తండ్రి ఫేస్‌బుక్ లో తన కుమారిడి ఫోటోలను పోస్ట్ చేశాడు. అందులో బాలుడు భుజంపై బ్యాండోలియర్‌తో తుపాకీతో ఉండటాన్ని చూడవచ్చు. సోషల్ మీడియాతో సహా తుపాకీ సంస్కృతిని ప్రోత్సహించే తుపాకీలను బహిరంగంగా ప్రదర్శించడాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.

పోలీసులు నమోదు చేసుకున్న ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. ఒక వ్యక్తి, అతని కుమారుడు, మరో ఇద్దరిని ఫొటోలో చూడవచ్చు. మాజీ మంత్రి, సీనియర్ శిరోమణి అకాలీదళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితియా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి చేతిలో పెద్ద బొమ్మ తుపాకీ మాత్రమే ఉందన్న ఆయన.. ఆప్ సర్కార్ అనవసర రాద్దాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం వాస్తవమేనని అమృత్ సర్ రూరల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వపన్ శర్మ అన్నారు. 10 ఏళ్ల చిన్నారిపై కేసు నమోదు కాలేదన్న ఆయన.. ఆ ఫొటోలో ఉన్న కొందరిపై మాత్రమేనని చెప్పారు. వివరాలను క్షుణ్ణంగా విచారించిన తర్వాత.. పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ రద్దు చేశారని తెలిపారు. తనపై కతునంగల్ స్టేషన్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందన్న చిన్నారి తండ్రి.. వారు చెప్పిన ఫోటో 2015 నాటిదని వివరించారు. అప్పుడు బాలుడికి నాలుగేళ్లు ఉన్నాయన్నారు. కానీ కేసు నమోదైందన్న విషయం తెలిసి.. ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం