ఛీ ఛీ.. మరీ ఇంత పైశాచికమా.. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై..

కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుద్ధులకు చిన్నా పెద్దా తేడా తెలియడం లేదు. చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న ప్రస్తుత రోజుల్లో.. వృద్దులపై కూడా అత్యాచారం జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్...

ఛీ ఛీ.. మరీ ఇంత పైశాచికమా.. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. 90 ఏళ్ల వృద్ధురాలిపై..
Harassment
Follow us

|

Updated on: Jan 15, 2023 | 7:29 AM

కామంతో కళ్లు మూసుకుపోయిన ప్రబుద్ధులకు చిన్నా పెద్దా తేడా తెలియడం లేదు. చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న ప్రస్తుత రోజుల్లో.. వృద్దులపై కూడా అత్యాచారం జరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, ఓ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాడోల్ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఓ గ్రామానికి ఓ వృద్ధురాలు వచ్చింది. తన బంధువులను పరామర్శించేందుకు జబల్‌పూర్ నుంచి షాడోల్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. వచ్చారు. రాత్రి కావడంతో ఆమె రైల్వే స్టేషన్‌లోనే ఉన్నారు. ఉదయం తాను వెళ్లాల్సిన ఊరికి వెళ్లే బస్సు కోసం రోడ్డు వైపు వెళ్లింది. అదే సమయంలో అక్కడికి ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చాడు. ఆమెను పలకరించాడు. ఆ ఊరి వరకు లిఫ్ట్ ఇస్తానంటూ నమ్మించాడు. అతని మాటలు నమ్మిన ఆమె బైక్ ఎక్కింది.

అయితే.. ఆమె వెళ్లాల్సిన ఊరికి కాకుండా, వేరే దారిలోకి తీసుకెళ్లాడు. అలా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడి నుంచి బంధువుల ఇంటికి చేరుకున్న వృద్ధురాలు జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. గుర్తుతెలియని వ్యక్తిపై అత్యాచారం, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..