వయస్సు ఎంత మీద పడినా.. ఆ తాత యువతను ఎలా మోటివేట్ చేస్తున్నాడో చూడాల్సిందే ! ఫిట్ నెస్ ‘గురూ’ !

వయస్సుకు, పట్టుదల, దీక్షకు సంబంధం లేదంటున్నాడు ఆ తాతయ్య.. మనసు ఉండాలేగానీ మార్గం తప్పక ఉంటుందని అంటున్నాడు.ఉదాహరణకు... చండీ గడ్ లో త్రిపాత్ సింగ్ అనే వ్యక్తి విషయానికే వస్తే ఇప్పుడు ఆయన ఓ సెలబ్రిటీ అయిపోయాడు.

  • Updated On - 3:27 pm, Tue, 8 June 21 Edited By: Narender Vaitla
వయస్సు ఎంత మీద పడినా.. ఆ తాత యువతను ఎలా మోటివేట్ చేస్తున్నాడో చూడాల్సిందే !  ఫిట్ నెస్ 'గురూ' !
76 Years Bv Old Chandigarh Man Beat Depression Goes Viral For Inspiring Workout

వయస్సుకు, పట్టుదల, దీక్షకు సంబంధం లేదంటున్నాడు ఆ తాతయ్య.. మనసు ఉండాలేగానీ మార్గం తప్పక ఉంటుందని అంటున్నాడు.ఉదాహరణకు… చండీ గడ్ లో త్రిపాత్ సింగ్ అనే వ్యక్తి విషయానికే వస్తే ఇప్పుడు ఆయన ఓ సెలబ్రిటీ అయిపోయాడు. వయస్సు 76 ఏళ్ళు మాత్రమే ! అయినా అది ఆయనను ఏ మాత్రం ప్రభావితం చేయలేదు సరికదా.. మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈయనను చూసి వేలాదిమంది స్ఫూర్తి పొందుతున్నారు మరి ! సోషల్ మీడియాలో ఈయనకు సుమారు 7 లక్షలమంది అభిమానులు ఉన్నారట.. ఫిట్ నెస్ సంతరించుకోవడానికి త్రిపాత్ సింగ్ చేస్తున్న ఎక్సర్ సైజులు, బరువులు ఎత్తడాలు చూస్తే వావ్ అనాల్సిందే.. 1999 లో తన భార్య మరణించినప్పటినుంచి చాలా డిప్రెషన్ లోకి వెళ్లానని, కానీ అలాగే ఉంటే ఆమె ఆత్మ క్షోభిస్తుందని, తన బిజినెస్ దెబ్బ తింటుందని భావించి.. ఇక ఫిట్ నెస్ కోసం శ్రమించనారంభించానని ఆయన చెబుతున్నాడు. ఎక్సర్ సైజులు చేస్తూ ఆ డిప్రెషన్ ని అధిగమించానంటున్నాడు. హ్యుమన్స్ ఆఫ్ బాంబే పేరిట గల ఇన్స్ టాగ్రామ్ లో తన వర్కవుట్ వీడియోలను ఈయన షేర్ చేశాడు. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతూనే ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 76 ఏళ్ళ వయస్సులో ఇన్ని ఎక్సర్ సైజులా అని ముక్కున వేలేసుకుంటున్నారు. ఏజ్ అన్నది సంఖ్య మాత్రమేనని, దీక్ష, మానసిక దృఢత్వానికి దానికి సంబంధం లేదని అంటున్నారు.

అన్నట్టు ఇప్పుడు త్రిపాత్ సింగ్ మంచి బిజినెస్ మన్ కూడానట……మంచి ఆహారం, ఆరోగ్యం జీవనానికి చక్కని పట్టుగొమ్మలని త్రిపాత్ సింగ్ అంటున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Tripat Singh (@_tripat_singh)

మరిన్ని ఇక్కడ చూడండి: భూమిపై దర్శనమిచ్చిన భారీ స్విమ్మింగ్ ఫూల్ ..!చూస్తుండగానే అంతకంతకు పెద్దదిగా మారుతుంది..:viral vieo.

నాట్యం చేస్తున్న నెమలి చుస్తే వావ్ అనాల్సిందే..వైరల్ అవుతున్న వీడియో : Peacock viral video

మాచవరంలో మంటగలిసిన మానవత్వం.. భర్త దహన సంస్కారాలు చేసిన భార్య : Viral Video.

లేడీస్‌ ఎంపోరియమ్ శ్రీకాంత్, చిట్టీ లతో మరో లవ్‌స్టోరీని ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌ అనుదీప్‌ : Jathi Ratnalu video.