ఇక వ్యాక్సిన్ల వెల్లువ… దేశంలో ఆగస్టు నుంచి 44 కోట్ల డోసుల టీకామందులు అందుబాటులోకి.. కేంద్రం

దేశంలో వ్యాక్సిన్ల కొరత తీరబోతోంది. ఆగస్టునుంచి వీటి షార్టేజ్ ఉండబోదని కేంద్రం ప్రకటించింది. మొత్తం 44 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మంగళవారం వెల్లడించింది. ఆగస్టు-డిసెంబరు మధ్య కాలంలో ఈ టీకా మందులను..

ఇక వ్యాక్సిన్ల వెల్లువ... దేశంలో ఆగస్టు నుంచి  44 కోట్ల డోసుల టీకామందులు అందుబాటులోకి.. కేంద్రం
44 Crore Doses Ordered Says Centre
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 08, 2021 | 7:34 PM

దేశంలో వ్యాక్సిన్ల కొరత తీరబోతోంది. ఆగస్టునుంచి వీటి షార్టేజ్ ఉండబోదని కేంద్రం ప్రకటించింది. మొత్తం 44 కోట్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని మంగళవారం వెల్లడించింది. ఆగస్టు-డిసెంబరు మధ్య కాలంలో ఈ టీకా మందులను ప్రొక్యూర్ చేసుకునేందుకు ఆర్దర్లు పెట్టామని, 25 కోట్ల డోసుల కోవీషీల్డ్, 19 కోట్ల డోసుల కోవాగ్జిన్ అందుబాటులో ఉంటాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్ పాలసీలో మార్పులు చేశామని ప్రధాని మోదీ నిన్న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రకటించిన విషయం గమనార్హం. విస్తృత వ్యాక్సినేషన్ లో భాగంగా ఇక డిసెంబరు వరకు వీటిని వినియోగిస్తామని ఆరోగ్య శాఖ వివరించింది. ఇప్పటికే పుణెలోని సీరం సంస్థకు, హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ కంపెనీకి ప్రభుత్వం 30 శాతం అడ్వాన్స్ పేమెంట్ చేసింది. ఇదే సమయంలో బయలాజికల్-ఈ సంస్థ నుంచి 30 కోట్ల డోసుల వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్దర్లు ఇచ్చినట్టు నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీ.కె. పాల్ తెలిపారు. ‘కొర్బీ వ్యాక్స్’ పేరిట ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న టీకామందుకు సంబంధించి అన్ని ట్రయల్స్ కు ఆమోదం లభించిన అనంతరం సెప్టెంబరు నుంచి ఈ వ్యాక్సిన్ దేశంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు.

కాగా కొత్త వ్యాక్సినేషన్ పాలసీ కింద ఈ సంస్థ వ్యాక్సిన్ ధర ఎంత ఉంటుందో వేచి చూస్తున్నామన్నారు. ఈ నెల 21 నుంచి దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ జరుగుతుందని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఆగమేఘాల మధ్య ఈ కంపెనీలకు ఆర్దర్లు పెడుతున్నారు. వ్యాక్సినేషన్ పాలసీలో లోపాలు ఉన్నాయని. వీటిని సరిదిద్దాలని సుప్రీంకోర్టు కూడా ఇటీవల కేంద్రానికి సూచించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: తెలుగు రాష్ట్రాల్లో ఆనందయ్య లు ఎంతమంది?ఊరుకోక ఆనందయ్య అనుచరులమంటూ మందు తయారీ..Viral Video.

ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ పంజా విసిరిన పెద్దపులి..రెండు ఎద్దుల పై దాడి చేసిన పులి..:Viral Video.

గత్యంతరం లేక ఈ నిర్ణయం..! స్వాగతమిస్తూనే చురకలంటించిన విపక్షాలు.కేంద్రం ఫ్రీ వాక్సిన్ పై స్పందన..

Y. S. Vivekananda Reddy : వివేకానంద హత్య కేసుపై సీబీఐ విచారణ పునఃప్రారంభం..కడపకు చేరుకున్న సీబీఐ అధికారులు