ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన ఇల్లు.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. పితోర్‌ఘర్‌ జిల్లాలోని చైసర్‌ గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ..

  • Tv9 Telugu
  • Publish Date - 2:12 pm, Fri, 21 August 20
ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన ఇల్లు.. ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటుచేసుకుంది. పితోర్‌ఘర్‌ జిల్లాలోని చైసర్‌ గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ యజమానితో పాటుగా ఆయన ఇద్దరు పిల్లలు శిథిలాల కింద విగతజీవులుగా పడిఉండగా.. మృతుడి భార్య తీవ్ర గాయాలపాలైంది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి భార్యను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇల్లు కుప్పకూలడానికి గల కారణాలు తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీ వర్షాల కారణంగానే ఈ ఇల్లు కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం