బ్రేకింగ్‌.. అసోంలో భూకంపం

బ్రేకింగ్‌.. అసోంలో భూకంపం

అసోంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారు జామున 5.26 గంటలకు అసోం రాష్ట్రంలోని సోనిట్‌పూర్‌ ప్రాంతంలో భూ ప్రంకంపనలు సంభవించాయి. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 08, 2020 | 6:21 AM

అసోంలో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారు జామున 5.26 గంటలకు అసోం రాష్ట్రంలోని సోనిట్‌పూర్‌ ప్రాంతంలో భూ ప్రంకంపనలు సంభవించాయి. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటంతో.. ఎలాంటి నష్టం వాటిళ్లలేదు.

కాగా, గత కొద్ది రోజులుగా నిత్యం ఎక్కడ ఓ చోట వరుస భూకంపాలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు.. జమ్ముకశ్మీర్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూకంపాలు సంభవిస్తున్నాయి. శుక్రవారం నాడు రాజస్థాన్‌లో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.

Read More :

కర్ణాటకలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu