JK DG Murder: ప్రకంపనలు రేపుతోన్న జమ్ముకశ్మీర్‌ జైళ్ల శాఖ డీజీ లోహియా హత్య.. అమిత్ షాకు గిఫ్ట్‌ అంటూ..

జమ్ముకశ్మీర్‌ జైళ్ల శాఖ డీజీ హత్యోదంతం ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇప్పటికే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

JK DG Murder: ప్రకంపనలు రేపుతోన్న జమ్ముకశ్మీర్‌ జైళ్ల శాఖ డీజీ లోహియా హత్య.. అమిత్ షాకు గిఫ్ట్‌ అంటూ..
Jk Dg Murder
Follow us

|

Updated on: Oct 05, 2022 | 6:17 AM

జమ్మూకశ్మీర్‌ జైళ్ల శాఖ DG హత్య ప్రకంపనలు రేపుతోంది. పనిపనిషే ఉన్నతాధికారిని హత్య చేసి ఆపై దహనం చేశారు. డిప్రెషన్‌, నిరాశా, నిస్పృహలతో జీవితంపై విరక్తి చెంది అతను ఉన్నతాధికారిని బలి తీసుకున్నట్టు చెప్తున్నారు. జమ్ముకశ్మీర్‌ జైళ్ల శాఖ డీజీ హత్యోదంతం ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఇప్పటికే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కలుగులో దాక్కున్న నిందితుడిని కటకటాలకు పంపారు. జమ్మూ కశ్మీర్‌లో జైళ్ల శాఖ డీజీని హత్య చేసినట్లు అనుమానిస్తోన్న ఇంటి సహాయకుడు యాసిర్‌ అహ్మద్‌ డైరీని గుర్తించారు పోలీసులు. అహ్మద్ ఆరు నెలలుగా డీజీ హేమంత్ లోహియా ఇంట్లో పనిచేస్తున్నాడు. అతడు దుందుడుకుగా ప్రవర్తించేవాడని, డిప్రెషన్‌లో ఉన్నాడని విచారణ అధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజులపాటు జమ్మూకాశ్మీర్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ జైళ్లశాఖ డీజీ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది.అటు హేమంత్ కుమార్ లోహియా హత్య తమ పనేనంటూ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రత్యేక నిఘాతో తమ టీమ్ ఈ పని పూర్తి చేసిందని ప్రకటనలో ఉంది. హిందుత్వ పాలకులను, వారి భాగస్వాములను హెచ్చరించేందుకే తాము ఈ పని చేసినట్లు తెలిపింది. అమిత్ షాకు ఇది మా గిఫ్ట్ అని..హై ప్రొఫైల్ ఉన్నవారిని టార్గెట్ చేసుకుని, అంతం చేస్తామనడానికి ఇది కేవలం ఆరంభం మాత్రమేనని కొత్తగా ఏర్పడిన ఈ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?