వరుస విమాన ప్రమాదాలతో అల్లకల్లోలం.. ఒకేరోజు కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్, ఫైటర్‌ జెట్‌..

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో రక్షణశాకకు చెందిన రెండు యుద్ధ విమానాలు కుప్పకూలడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు

వరుస విమాన ప్రమాదాలతో అల్లకల్లోలం.. ఒకేరోజు కుప్పకూలిన సుఖోయ్, మిరాజ్, ఫైటర్‌ జెట్‌..
Sukhoi Plane
Follow us

|

Updated on: Jan 28, 2023 | 12:06 PM

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లలో రక్షణశాఖకు చెందిన రెండు యుద్ధ విమానాలు, ఓ ఫైటర్ జెట్ కుప్పకూలడం కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 విమానాలు కూలిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. దీంతోపాటు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పింగోరా రైల్వే స్టేషన్ సమీపంలో ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయింది. ఈ రెండు ఘటనలకు సంబంధించి సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

గ్వాలియర్‌ ఎయిర్‌బేస్‌ నుంచి యుద్ధ విమానాల విన్యాసాలు జరుగుతుండగా.. మొరెనా సమీపంలో సుఖోయ్‌-30, మిరాజ్‌ విమానాలు ఒకదానికొకటి ఢీకొని కుప్పకూలాయి. శిక్షణ సమయంలో ఇవి ఢీకొన్నట్లు పేర్కొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రెండు విమానాలు వ్యాయామాలు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

ఇవి కూడా చదవండి

రాజస్థాన్ భరత్‌పూర్‌లో చార్టర్డ్ విమానం క్రాష్‌ ల్యాండింగ్ అయింది. పింగోరా రైల్వే స్టేషన్ సమీపంలో ఎయిర్ ఫోర్స్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానం ముక్కలై మంటలు చెలరేగాయి. ఈ ఫైటర్ జెట్ ఆగ్రా నుంచి బయలుదేరినట్లు పేర్కొంటున్నారు. భరత్‌పూర్ సమీపంలో చార్టర్డ్ విమానం కూలిపోయిందని భరత్‌పూర్ డీఎం అలోక్ రంజన్ తెలిపారు. పోలీసులు, పరిపాలన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని తెలిపారు.

ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. మరో పైలట్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ సంఘటనలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..