‘మీ ప్రయాణాలను వాయిదా వేసుకొండి’..రైల్వే శాఖ అభ్యర్థన

కరోనా నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రైల్వే శాఖ కోరింది. ఈ నెల 13-16  మధ్య తేదీల్లో రైళ్లలో ప్రయాణించిన కనీసం 12 మందికి ఈ వైరస్ సోకిందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.

'మీ ప్రయాణాలను వాయిదా వేసుకొండి'..రైల్వే శాఖ అభ్యర్థన
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Mar 21, 2020 | 5:08 PM

కరోనా నేపథ్యంలో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రైల్వే శాఖ కోరింది. ఈ నెల 13-16  మధ్య తేదీల్లో రైళ్లలో ప్రయాణించిన కనీసం 12 మందికి ఈ వైరస్ సోకిందని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. అందువల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా ప్రజలు తమ అన్ని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అభ్యర్థించాయి . ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలను రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. ఈ నెల 13 న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ లో ప్రయాణించిన 8 మందికి కరోనా పాజిటివ్ సోకినట్టు తెలిసిందని. ఈ రైల్లో ప్రయాణించిన దంపతుల్లో భర్త చేతికి క్వారంటైన్ ముద్ర చూసిన ఇతర ప్రయాణికులు ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయగా.. వారిని దింపి వేసినట్టు సమాచారం అందిందని రైల్వే శాఖ వెల్లడించింది. ఇలా ఉండగా.. ఆదివారం ఏ ట్రెయిన్  సర్వీసు కూడా ఉండబోదని, అయితే ఆదివారానికి ముందు ప్రయాణిస్తూ.. తమ గమ్యాలకు  చేరవలసిన రైళ్లు ఆగబోవని ఈ శాఖ స్పష్టం చేసింది.

కాజీపేటలో దంపతుల దింపివేత

అటు-.. బెంగుళూరు సిటీ-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ఓ జంట ప్రయాణిస్తుండగా.. వీరి చేతులపై క్వారంటైన్   ముద్ర కనిపించిందని, దీంతో వీరిని వరంగల్  జిల్లా కాజీపేటలో దింపివేశారని తెలిసింది. వీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శనివారం రైలు ఎక్కారట.. ఇండోనేసియాలోని బాలి నుంచి వఛ్చిన వీరు ఢిల్లీకి చెందిన వారని సమాచారం. ఈ జంటను కాజీపేటలో దింపివేసి.. వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ రైల్లో ఈ దంపతులు  ప్రయాణించిన బోగీని వెంటనే శానిటైజ్ చేసి ఆ బోగీని లాక్ చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu