Covid-19: చిన్నారులపై కరోనా పంజా.. ఉత్తరాఖండ్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి

Childrens - Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. అయితే.. కరోనా మహమ్మారి చిన్నారులపై

  • Publish Date - 8:14 am, Mon, 17 May 21 Edited By: Ram Naramaneni
Covid-19: చిన్నారులపై కరోనా పంజా.. ఉత్తరాఖండ్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారి
Covid-19

Childrens – Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. అయితే.. కరోనా మహమ్మారి చిన్నారులపై పంజా విసురుతోంది. ఇటీవల కాలంలో ఉత్త‌రాఖండ్‌లో చిన్నారుల‌పై క‌రోనా పగబట్టింది. ఈ రాష్ట్రంలో క‌రోనా బారిన ప‌డుతున్న చిన్నారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. కేవ‌లం గ‌త 10 రోజుల వ్య‌వ‌ధిలో తొమ్మిదేళ్ల లోపు వ‌య‌సున్న 1000 మందికి పైగా చిన్నారులకు క‌రోనా వైర‌స్ సోకింద‌ని ఉత్త‌రాఖండ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో కొంత‌మంది చిన్నారులు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నార‌ని తెలిపింది.

ఉత్త‌రాఖండ్ ఆరోగ్య‌శాఖ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌తేడాది దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభం నాటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వ‌ర‌కు ఏడాది కాలంలో ఉత్త‌రాఖండ్‌లో కేవ‌లం 2,131 మంది చిన్నారులు క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఏప్రిల్ 1 నుంచి 15 వ‌ర‌కు కేవలం ప‌దిహేను రోజుల వ్య‌వ‌ధిలో 264 మందికి మాత్ర‌మే వైర‌స్ సోక‌గా.. ఏప్రిల్ 16 నుంచి 30 వ‌ర‌కు మ‌రో 15 రోజుల వ్య‌వ‌ధిలో 1,053 మంది వైర‌స్ బారిన‌ప‌డినట్లు వెల్లడించింది.

మే 1 నుంచి 14 వ‌ర‌కు కేవ‌లం 14 రోజుల వ్య‌వ‌ధిలో 1,618 మంది చిన్నారులకు వైర‌స్ సోకింది. ఇదిలాఉంటే.. హరిద్వార్ కుంభమేళా నాటి నుంచి ఉత్త‌రాఖండ్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 79,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో ఈ మహమ్మారి కారణంగా 4,426 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

Also Read:

Pvt Hospitals : ట్విట్టర్లో బాధితుడి ఫిర్యాదు, మహబూబ్ నగర్ జిల్లాలో పంచవటి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Mahesh Babu: మహేష్ బాబుతో రాజమౌళి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు..