Medical Colleges: జిల్లా ఆస్పత్రుల అప్‌గ్రేడ్‌.. ఐదేళ్లలో 100 కొత్త మెడికల్‌ కాలేజీలు: ఆరోగ్య మంత్రిత్వశాఖ

ఆరోగ్య రంగాన్ని మరింతగా మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. నాలుగో దశలో కింద జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా 2027 నాటికి 100 కొత్త..

Medical Colleges: జిల్లా ఆస్పత్రుల అప్‌గ్రేడ్‌.. ఐదేళ్లలో 100 కొత్త మెడికల్‌ కాలేజీలు: ఆరోగ్య మంత్రిత్వశాఖ
Medical Colleges
Follow us

|

Updated on: Nov 15, 2022 | 7:10 AM

ఆరోగ్య రంగాన్ని మరింతగా మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. నాలుగో దశలో కింద జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా 2027 నాటికి 100 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించింది . జిల్లా లేదా రెఫరల్ ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం కేంద్ర ప్రాయోజిత పథకం కింద కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర, రాష్ట్ర వాటా 60:40 ఆధారంగా ఒక్కో కళాశాలకు రూ. 325 కోట్ల అంచనా వ్యయంతో ఈ కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు.

ఈశాన్య, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు నిధుల సరళి కేంద్రం, రాష్ట్రం మధ్య 90:10 నిష్పత్తిలో ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను వ్యయ విభాగం ఆమోదించిందని, దీనికి సంబంధించి క్యాబినెట్ నోట్‌ను ఇప్పటికే రూపొందించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. గత మూడు దశల్లో 157 మెడికల్ కాలేజీలకు అనుమతి లభించగా, వాటిలో 93 మెడికల్‌ కళాశాలల పనులను ప్రారంభించారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

ఈ ప్రతిపాదిత 100 మెడికల్ కాలేజీలు 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 100 జిల్లాల్లో మరియు ప్రైవేట్ లేదా ప్రభుత్వ వైద్య కళాశాలలు లేని చోట ఏర్పాటు చేయబడతాయి. స్కీమ్ నాలుగో దశలో జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడం ద్వారా 100 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు వ్యయ ఆర్థిక కమిటీ (ఇఎఫ్‌సి) ఆమోదం తెలిపింది. ఇంకా, కేంద్ర ప్రాయోజిత పథకంలో మొదటి మూడు దశల్లో ఇప్పటికే ఆమోదించబడిన 157 మెడికల్ కాలేజీలతో అనుబంధంగా నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు ఒక్కొక్కటి రూ. 10 కోట్ల వరకు ఖర్చు చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?