ప్రపంచవ్యాప్తంగా పోల్చితే.. భారత్ లో మరణాల రేటు తక్కువే : కేంద్రం

కరోనా రాకాసి విరుచుకుపడుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని వెల్లడించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రపంచ దేశాలతో పోల్చితే మరణాల రేటు ఇండియాలో అత్యల్పంగా ఉందని వెల్లడించింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్‌ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు 6.4 శాతంగా ఉండగా, భారత్‌లో అది 2.8 శాతంగా ఉందన్నారు. లాక్‌డౌన్, వెంటనే కేసులు గుర్తించి కంటైన్‌మెంట్ జోన్లను […]

ప్రపంచవ్యాప్తంగా పోల్చితే..  భారత్ లో మరణాల రేటు తక్కువే : కేంద్రం
Follow us

|

Updated on: May 26, 2020 | 7:33 PM

కరోనా రాకాసి విరుచుకుపడుతూనే ఉంది. దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి కోలుకునే వారి సంఖ్య పెరిగిందని వెల్లడించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ప్రపంచ దేశాలతో పోల్చితే మరణాల రేటు ఇండియాలో అత్యల్పంగా ఉందని వెల్లడించింది. మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్‌ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు 6.4 శాతంగా ఉండగా, భారత్‌లో అది 2.8 శాతంగా ఉందన్నారు. లాక్‌డౌన్, వెంటనే కేసులు గుర్తించి కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయడం వల్ల మరణాల సంఖ్యను అదుపులో ఉంచగలిగామని చెప్పారు. లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ, ముఖానికి మాస్కులు తప్పక ధరించాలని సూచించారు. అటు, వ్యాక్సిన్‌ వచ్చే వరకు కొవిడ్ 19 కట్టడికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. వైరస్‌ను అరికట్టడంలో ఇప్పటి వరకు విజయం సాధించామన్న లవ్ ఆగర్వాల్.. కరోనా మీద పోరు మాత్రం పూర్తి కాలేదని స్పష్టం చేశారు. గడిచిన 24 గంటల్లో 6,535 కేసులు నమోదు కాగా, మంగళవారం నాటికి మొత్తం కొవిడ్ 19 బాధితుల సంఖ్య 1,45,380కి చేరిందని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొంది. వారిలో 60,490 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 4,167 మంది మరణించారు. అయితే వలసకార్మికులు స్వస్థలాలకు చేరుతుండడంతో.. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.