ఢిల్లీ కూరగాయల్లో విషపూరిత పదార్థాలు!

నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన ఓ పరిశోధన భయానక నిజాలు బయటపెట్టింది. ఢిల్లీలో అమ్ముతున్న కూరగాయల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేల్చింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఢిల్లీ మార్కెట్‌కు తరలించే కూరగాయల్లో టాక్సిక్ మెటల్స్ ఉన్నాయనే విషయం వెలుగుచూడటంతో నగరవాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. యమునా నది పరీవాహక ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయల్లో భారీ స్థాయిలో ‘లెడ్‌’ పరిమాణం ఉందని నిర్దరించారు. వీటిని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌, అవయవాలు దెబ్బతినడం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడు […]

ఢిల్లీ కూరగాయల్లో విషపూరిత పదార్థాలు!
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 11:43 PM

నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన ఓ పరిశోధన భయానక నిజాలు బయటపెట్టింది. ఢిల్లీలో అమ్ముతున్న కూరగాయల్లో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు తేల్చింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఢిల్లీ మార్కెట్‌కు తరలించే కూరగాయల్లో టాక్సిక్ మెటల్స్ ఉన్నాయనే విషయం వెలుగుచూడటంతో నగరవాసుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. యమునా నది పరీవాహక ప్రాంతాల్లో పండిస్తున్న కూరగాయల్లో భారీ స్థాయిలో ‘లెడ్‌’ పరిమాణం ఉందని నిర్దరించారు. వీటిని దీర్ఘకాలికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌, అవయవాలు దెబ్బతినడం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తేల్చారు. చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు సైతం తలెత్తే ముప్పు ఉంది.

పంటపొలాలు, వ్యవసాయ క్షేత్రాల నుంచి తెచ్చిన ఈ కూరగాయలను ఢిల్లీలోని ప్రధాన మండీలకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి వారాంతపు సంతలు, వీధుల్లోని చిన్న చిన్న దుకాణాలకు వీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఢిల్లీ వాసుల్లో ఎక్కవ శాతం జనాభా వీటినే వినియోగిస్తున్నారు. ఆయా మార్కెట్ల నుంచి సేకరించిన కూరగాయలను పరీక్షించి చూడగా.. కొత్తిమీర, పాలకూరల్లో సాధారణ స్థాయిని మించి లెడ్‌ ఉన్నట్లు గుర్తించారు. కూరగాయల్లో లెడ్‌ పరిమాణం ఒక కిలోకి 2.5మి.గ్రా ఉండాల్సి ఉండగా.. అక్కడ మాత్రం 2.8మి.గ్రా నుంచి గరిష్ఠంగా 13.8మి.గ్రా వరకు ఉందట. లెడ్‌ మినహా నికెల్‌, క్యాడ్మియం, మెర్‌క్యురీ మాత్రం సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. బ్యాటరీలు, పెయింట్‌, పాలిథీన్‌, ఆటోమొబైల్‌ విడిభాగాల తయారీ లాంటి పరిశ్రమల వల్లే నదుల్లో లెడ్‌ పరిమాణం పెరుగుతుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!