National polio drive : జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీ ఖరారు చేసిన కేంద్రం, ఐదేళ్లలోపు చిన్నారులకు ఈనెల 31న పోలియో చుక్కలు

National polio drive : జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు..

National polio drive : జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీ ఖరారు చేసిన కేంద్రం, ఐదేళ్లలోపు చిన్నారులకు ఈనెల 31న పోలియో చుక్కలు
Follow us

|

Updated on: Jan 15, 2021 | 7:51 AM

National polio drive : జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం తేదీని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసే క్రతువు జనవరి 31న నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ముందు ప్రకటించిన తేదీ ప్రకారం జనవరి 17 న దేశవ్యాప్తంగా పల్స్‌ పోలియో ఇమ్యునైజేషన్‌ ప్రోగ్రామ్ జరగాల్సి ఉన్నప్పటికీ, వివిధ కారణాల రిత్యా కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మళ్లీ పల్స్‌ పోలియో నిర్వహించే తేదీని వెల్లడిస్తామని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు కూడా రాసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేషనల్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్‌ సలహాదారు ప్రదీప్‌ హల్డర్‌ రాష్ట్రాలకు సమాచారం అందించారు. కేంద్రం కోవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఈనెల 16 నుంచి చేపడుతుండటంతో ఎదురయ్యే ఇబ్బందుల నేపథ్యంలో పోలియో కార్యక్రమాన్ని వాయిదా వేసి, ఇప్పుడు జనవరి 31న నిర్వహించబోతున్నారు.