Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

బీజేపీ రూటే సెపరేటు.. “మహా”సంగ్రామంలో మరో ఫ్రూఫ్

ఎన్నికలు వస్తే చాలు.. ఒక్కో పార్టీది ఒక్కో వ్యూహం.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అనేక తాయిలాలను మేనిఫెస్టోలో పొందుపరుస్తూ.. ప్రచారంలో దూసుకెళ్తారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం అందుకు విరుద్ధం.. మేనిఫెస్టో పెట్టినా.. దానిపై ఎక్కడా కూడా ఎక్కువగా మాట్లాడదు. అయినా జరిగే ఎన్నికల్లో విజయం కమలం జేబులో పడాల్సిందే. దానికి బీజేపీ ఉపయోగించే ఒకే ఒక విజయ మహామంత్రం.. జాతీయ భావాన్ని ప్రజల్లో రేకెత్తించడం. అవును.. గత ఎన్నికల్లో బీజేపీ ప్రచారాన్ని చూస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది.

గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ముందు వరకు దేశంలో రాఫెల్ యుద్ధ విమానాల డీల్ విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14న దేశంలో పుల్వామా దాడి జరగడంతో.. దేశం మొత్తం ఉగ్రవాదులపై, పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలతో ఉంది. అదే సమయంలో బీజేపీ పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఘటన జరిగిన పక్షం రోజులకే ప్రపంచ దేశాలు ఊహించని విధంగా పాకిస్థాన్‌ ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే విపక్షాలు ఈ ఘటనపై కేంద్రంపై ఆరోపణలు చేసినా.. దేశ ప్రజలు మోదీ వెంటే ఉన్నారు. బాలాకోట్‌పై సర్జికల్ దాడులు చేస్తే.. వాటికి సాక్ష్యాలు ఏక్కడ అంటూ విపక్షాలు నోరు జారాయి. ఓ వైపు పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్ జరగడంతో.. దిక్కుతోచని స్థితిలో కయ్యానికి కాలు దువ్వుతుంటే.. విపక్షాలు దేశ భద్రతకు సంబంధించిన విషయంలో కేంద్రానికి మద్దతుగా ప్రత్యక్షంగా నిలవలేకపోయారు. ఇదే అంశాన్ని బీజేపీ అస్త్రంగా చేసుకుంది. దేశ వ్యాప్తంగా ప్రజల్లో జాతీయ భావాలు రేకెత్తించి.. బాలాకోట్ దాడుల గురించి ప్రస్తావిస్తూ.. ఓటర్లను తమవైపు మలుపుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా.. ప్రతిపక్ష పార్టీలు.. లోక్‌సభలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయారు.

తాజాగా ఇప్పుడు హర్యానా, మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే స్ట్రాటజీని ఉపయోగిస్తోంది. అయితే ఈ సారి అధికారంలోకి వచ్చాక.. సహాసోపేతమైన నిర్ణయం తీసుకుని దేశ వ్యాప్తంగా మరోసారి జాతీయ భావనను రేకెత్తించారు. అదే జమ్ముకశ్మీర్‌ ఆర్టికల్ 370 రద్దు. ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే ఇదే అంశాన్ని ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తుంది. హర్యానా, మహారాష్ట్రలో సెంటిమెంట్ ఎక్కువ. ఇరు రాష్ట్రాలు జాతీయ భావాలు, ప్రాంతీయ తత్వంతో ముడిపడి ఉన్నవే. అందులో హర్యానా నుంచి ఆర్మీ చేరికలు ఎక్కువగా ఉంటే.. ఇక మహారాష్ట్రలో ప్రాంతీయతతో పాటుగా మతం, దేశ భక్తితో ముడిపడి ఉన్న ప్రాంతం ఇది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో దేశం ఆర్థిక రంగం అయోమయంగా ఉంది. జీడీపీ రేటు తగ్గడంతో.. దేశ ఆర్థిక పరిస్థితి చిక్కుల్లో పడింది. అయితే ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నా.. ఇంకా పరిస్థితి మెరుగవ్వలేదు. అయితే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకునేందుకు ప్రయత్నించినా.. బీజేపీ పాచికల ముందు అవి పారడం లేదు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ దేశ ఆర్థిక పరిస్థితిపై విమర్శలు చేస్తున్నా.. బీజేపీ మాత్రం ఆర్టికల్ 370 అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకోస్తూ.. విపక్షాలకు సవాల్ విసురుతోంది. దీంతో విపక్షాలు ఆత్మరక్షణలో పడుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు.. బీజేపీ వేసిన ఈ స్కెచ్‌లో మరోసారి విపక్షాలు బొక్కబోర్ల పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందన్నది మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.