రాయలసీమ ఎత్తిపోతలకు లైన్ క్లియర్..! టెండర్లకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుకోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు తిరిగి మొదలు కానున్నాయి.

రాయలసీమ ఎత్తిపోతలకు లైన్ క్లియర్..! టెండర్లకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్
Follow us

|

Updated on: Jul 14, 2020 | 12:41 PM

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంపుకోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు తిరిగి మొదలు కానున్నాయి. నిర్మాణ పనులను కొనసాగించడనికి బ్రేక్ వేస్తూ ఇదివరకు ఇచ్చిన స్టేను నేషనల్ గ్రీన్ ట్రుబ్యునల్ (ఎన్జీటీ) ఎత్తేసింది. ఈ పథకం నిర్మాణానికి అవసరమైన ప్రాథమిక పనులను పూర్తి చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు చెన్నైలోని ఎన్‌జీటీ జోనల్‌ బెంచి సోమవారం వివరణ ఇచ్చింది. మే 20న ఈ పథకం పనులు ఆపేయాలంటూ ఇచ్చిన ఆదేశాలను ఎన్జీటీ సవరించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది ఎన్జీటీ. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వీలుగా పర్యావరణ అనుమతులను మంజూరు చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనే విషయన్ని పరిశీలించి స్పష్టం చేయాలని పేర్కొంది. అప్పటిదాకా ఈ కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణను వచ్చేనెల 11వ తేదీకి వాయిదా వేసింది.