రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ ఊరట..

రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చని పేర్కొంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్ర సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ వెల్లడించారు. సాధారణ పరిమితి 3 శాతంపై ఎటువంటి ఆంక్షలు లేవు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(GDP)లో అదనంగా పొందే 2 శాతం రుణంలో 0.50 శాతానికి […]

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ ఊరట..
Follow us

|

Updated on: May 22, 2020 | 3:10 PM

రాష్ట్రాలు అదనంగా తీసుకునే 2 శాతం రుణాల వినియోగంపై ఆంక్షలు ఎత్తివేస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. అవసరాలకు తగినట్లుగా రాష్ట్రాలు వాడుకోవచ్చని పేర్కొంది. ఎప్పటి మాదిరిగా 3శాతం రుణ వినియోగంపై ఆంక్షలు లేవని, అదనంగా ఉండే 2 శాతంలో ఒక శాతం పౌర కేంద్ర సంస్కరణల అమలుకు ఖర్చుపెట్టాల్సి ఉంటుందని ఆర్థికశాఖ వెల్లడించారు. సాధారణ పరిమితి 3 శాతంపై ఎటువంటి ఆంక్షలు లేవు. స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి(GDP)లో అదనంగా పొందే 2 శాతం రుణంలో 0.50 శాతానికి ఎటువంటి నిబంధనలు వర్తించవని ఆర్ధిక శాఖ అధికారులు వెల్లడించారు. 1 శాతంలో మాత్రం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే ఒక్కో సంస్కరణ.. వన్‌ కార్డ్, వన్‌ నేషన్, స్థానిక సంస్థల బలోపేతం, విద్యుత్‌ రంగం వంటి వాటికి 0.25 శాతం చొప్పున అదనంగా వినియోగించుకోవచ్చు. కేంద్రం సూచించిన ఏవైనా మూడు సంస్కరణలు అమలు చేస్తే మిగతా 0.50 శాతం రుణం అదనంగా వాడుకోవచ్చువని ఆధికారులు వివరించారు. అదేవిధంగా, కేంద్ర పన్నుల్లో ఏప్రిల్, మే నెలలకు గాను రాష్ట్రాల వాటా కింద రూ.92,077 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇది వరకే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలకు ఆసరాగా ఉండేందుకు 2020–21 బడ్జెట్‌లో ప్రకటించిన మేరకు ఈ మొత్తం విడుదల చేశామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!