Breaking News
  • విజయవాడ: ఢిల్లీ అల్లర్ల బాధితుల కోసం సీపీఎం విరాళాల సేకరణ. మార్చి 2, 3 తేదీల్లో విరాళాలు సేకరించాలని పార్టీ శాఖలకు పిలుపు. సహృదయులైన దాతలు ఆదుకోవాలని కోరుతున్నాం-సీపీఎం ఏపీ కార్యదర్శి మధు.
  • చెన్నై: వేలూరు డిప్యూటీ కలెక్టర్‌ దినకరన్‌ అరెస్ట్‌. అవినీతి ఆరోపణలతో అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు. ఏసీబీ తనిఖీల్లో భారీగా నగదు లభ్యం. తిరువన్నామలైకి చెందిన రంజిత్‌ కుమార్‌ భూముల విక్రయంలో ఆరోపణలు. ఏసీబీ సోదాల్లో ఇప్పటి వరకు రూ.76 లక్షల నగదు లభ్యం.
  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ ఖరారు. మార్చి 6 నుంచి తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు. మార్చి 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం.
  • నోరు తెరిస్తే 14 ఏళ్లు సీఎంగా చేశా అంటారు. మమ్మల్నే అడ్డుకుంటారా అంటూ పోలీసులపై చిందులేయడం.. మీ మానసిక దౌర్భల్యాన్ని బయటపెడుతోంది. మీరు జీతాలిచ్చే హెరిటేజ్‌ స్టాఫ్‌ కూడా మాటలు పడరు.
  • ఢిల్లీలో 14 విమానాల దారి మళ్లింపు. వాతావరణం అనుకూలించక విమానాల దారి మళ్లింపు. లక్నో, అహ్మదాబాద్‌, జైపూర్‌ ఎయిర్‌పోర్టులకు మళ్లించిన అధికారులు.

మోదీకి పాక్ సింగర్ వార్నింగ్..”అది మీ నేషనల్ యూనిఫామ్” అన్న నెటిజన్స్

Pakistan singer Rabi Pirzada threatens PM Modi again, మోదీకి పాక్ సింగర్ వార్నింగ్..”అది మీ నేషనల్ యూనిఫామ్” అన్న నెటిజన్స్

భారత్ అంటే పాక్‌కు ఎంత ద్వేషమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎదురుగా ఫేస్ చెయ్యడం చేతకాక..దొడ్డి దారుల్లో తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుంది. అందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటుంది. వెనుక నుంచి మన జవాన్లపై కాల్పులు జరపడం..పక్క దేశాల వద్దకు వెళ్లి ఇండియాను బ్లెయిమ్ చేసే ప్రయత్నం చేయడం..యూన్‌లో కంప్లైంట్ చెయ్యడం ఇలా చాలా మార్గాలనే పాక్ ఎన్నుకుంది. కానీ భారత్ ముందు దాయాది దేశం పాచికలు పారలేదు. తాజాగా పాక్‌కు చెందిన వివాదాస్పద గాయని రబ్బీ పిర్జాదా భారత్‌ను కించపరిచేందుకు నూతన మార్గాన్ని ఎన్నుకుంది.

ఇండియాను టార్గెట్ చేస్తూ తన సోషల్ మీడియా పేజీలో ఎప్పటికప్పుడు వివాదాస్పద కమెంట్స్ పోస్ట్ చేసే ఈ సింగర్.. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకరమైన పోస్ట్ పెట్టింది. అసభ్య పదజాలాన్ని వాడుతూ బెదిరించే ప్రయత్నం చేసింది. ఆత్మాహుతి బాంబర్ జాకెట్ ధరించి మోదీ కోసమే అంటూ ట్వీట్ చేసింది సదరు సింగర్. అంతేకాదు మోదీని అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చింది. ఈమె వ్యాఖ్యలు.. చేసిన చేష్టలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  అయితే ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు భారత నెటిజన్లు. మా ప్రధానిని టార్గెట్ చేస్తే తోలు తీస్తాం అంటూ ఇప్పటికే మనవాళ్లు వార్నింగ్స్ ఇచ్చేశారు. మరికొందరు..’ ఏంటి ఇది మీ పాకిస్తాన్ యూనిఫామా’ అంటూ రబ్బీకి సెటైర్స్ వేస్తున్నారు. ఆ మధ్య చేతుల్లో పాముల్ని పట్టుకోని వీటిని మోదీ మీదకు వదులుతా అంటూ కూడా ఈ నటి రచ్చ చేసిన సంగతి తెలిసిందే.

Related Tags