అపోలో మిషన్: ఈ అడుగుపడి సరిగ్గా 51 సంవత్సరాలు..

మనిషి చంద్రుడి మీద తొలి అడుగు వేసి నేటితో 51 ఏళ్లు పూర్తయింది. 1969 జూలై 20వ తేదీన అపోలో 11 మిషన్‌తో జాబిల్లిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలి అడుగు పెట్టాడు.

  • Ravi Kiran
  • Publish Date - 7:53 pm, Mon, 20 July 20

NASA Tweet Team Apollo: మనిషి చంద్రుడి మీద తొలి అడుగు వేసి నేటితో 51 ఏళ్లు పూర్తయింది. 1969 జూలై 20వ తేదీన అపోలో 11 మిషన్‌తో జాబిల్లిపై నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలి అడుగు పెట్టాడు. 1969 జూలై 16న నింగికి ఎగసిన అపోలో 11 సరిగ్గా నాలుగు రోజుల తర్వాత జాబిల్లిపై దిగింది. ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్, మైకేల్‌ కోలిన్స్‌తో కూడిన బృందం చంద్రుడిపైకి చేరుకున్నారు. ఇక అపోలో 11 మిషన్ తర్వాత మొత్తం 6 ప్రయోగాలు జరగగా.. అందులో ఐదు జాబిల్లిపై ల్యాండ్ అయ్యాయి.

కాగా, ఈ అద్భుతమైన రోజును పురస్కరించుకుని నాసా ట్వీట్ చేసింది. ” ఈ రోజు, సరిగ్గా 51 సంవత్సరాల క్రితం.. ఒక చిన్న అడుగు.. మొత్తం ప్రపంచాన్నే మార్చేసింది. అపోలో 11 మిషన్‌తో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్, మైకేల్‌ కోలిన్స్‌ మొదటిసారి చంద్రుడిపై ల్యాండ్ అయ్యారు. ఇక రాబోయే అర్తెమిస్ ప్రోగ్రాం ద్వారా.. జాబిల్లిపై మొదటి స్త్రీ, తదుపరి వ్యక్తిని చేరుస్తామని’ పేర్కొంది.