నాసాకూ చిక్కని ‘ విక్రమ్ ‘ ఆచూకీ.. ఇస్రోలో ఇంకా ‘ చల్లారని ‘ ఆశలు

Chandrayaan-2 mission recently made an attempt to soft land its Vikram module on the Moon., నాసాకూ చిక్కని ‘ విక్రమ్ ‘ ఆచూకీ.. ఇస్రోలో ఇంకా ‘ చల్లారని ‘ ఆశలు

చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుని సౌత్ పోల్ వద్దకు పంపిన విక్రమ్ లాండర్ ఆచూకీ ఇంకా లభించలేదు. చివరి నిముషంలో లాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోయిన సంగతి విదితమే. దీంతో విక్రమ్ జాడ కనుగొనేందుకు నాసా ముందుకు వచ్చింది. అది దిగినట్టు భావిస్తున్న ప్రాంతంలో తమ ల్యూనార్ రికన్నాయిజెన్స్ ఆర్బిటర్ నుంచి ఫోటోలు తీసింది. కానీ వాటిలో ఎక్కడా విక్రమ్ ఆచూకీ కనిపించలేదని, అందువల్లే వాటిని మరింత నిశితంగా పరిశీలించాలనుకుంటున్నామని నాసా వెల్లడించింది. ఫోటోలు తీసే సమయానికి లాండర్ నీడలో ఉండడం గానీ, నిర్దిష్ట ప్రాంతానికి అవతలివైపు ఉండడం గానీ ఉన్నట్టయితే ఈ ఇమేజీలలో కనిపించవచ్చునని, అయినా పాత ఫొటోలతో పోల్చి చూడాల్సి ఉందని నాసా ఎల్ ఆర్ ఓ డిప్యూటీ ప్రాజెక్ట్ అధికారి జాన్ కెల్లర్ తెలిపారు. తమ ఆర్బిటర్ చంద్రుని ఉపరితలానికి అతి సమీపం నుంచి ఫోటోలు తీయడంవల్ల నీడ ఎక్కువగా పడిందని అన్నారు. మరోవైపు-విక్రమ్ తో సంబంధాలను పునరుధ్దరించేందుకు ఇస్రో ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *