Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

విక్రమ్ ల్యాండర్ ఆచూకీలో తొలి అడుగు.. ఫొటోలు విడుదల చేసిన నాసా

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘చంద్రయాన్‌ 2’లోని విక్రమ్ ల్యాండింగ్ కోసం ముందుగా నిర్ధేశించిన ప్రాంత ఫొటోలను నాసాకు చెందిన ఎల్ఆర్వో(లూనార్ రెకొనైసెన్స్ ఆర్బిటర్) తీసింది. సెప్టెంబర్ 17న  ఈ ఫొటోలను తీయగా.. వాటిని తాజాగా విడుదల చేసింది. రాత్రి సమయంలో తీయడం వలన విక్రమ్ ల్యాండర్ ఎక్కడ లొకేట్ అయ్యిందో గుర్తించలేకపోతున్నామని నాసా ప్రకటించింది. అయితే అక్టోబర్‌లో పగలు సమయం వస్తుందని.. అప్పుడు విక్రమ్‌కు చెందిన పలు ఫొటోలను తీస్తామని ఆ సంస్థ తెలిపింది. ‘‘విక్రమ్ ల్యాండర్‌ హార్డ్‌గా ల్యాండ్ అయింది. చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ఎక్కడ ల్యాండ్ అయ్యింది అనే విషయాన్ని ఇంకా నిర్ధారించాల్సి ఉంది’’ అని నాసా వెల్లడించింది.

‘‘అక్టోబర్ 14న మరోసారి ఎల్ఆర్వో.. విక్రమ్ ల్యాండ్ అయిన స్థానం నుంచి ప్రయాణించనుంది. అప్పుడు పగటి సమయం ఉండటం వలన ల్యాండర్ స్థానాన్ని గుర్తించేందుకు పరిస్థితులు మరింత అనుకూలించనున్నాయి’’ అని ఆ ఆర్బిటర్‌ మిషన్‌కు చెందిన డిప్యూటీ ప్రాజెక్ట్ సైంటిస్ట్ జాన్ కెల్లర్ ఓ మెయిల్‌లో తెలిపారు. కాగా నాసా జూలై 22న చంద్రయాన్ 2ను ప్రతిష్టాత్మకంగా ప్రయోగించింది.  అన్ని కక్ష్యల్లోనూ విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ 2.. చంద్రుడి కక్ష్యకు మరో 2.1కి.మీ దూరంలో ఉందనగా.. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఆ తరువాత దానితో సంబంధాలు మెరుగుపరిచేందుకు ఇస్రోతో పాటు నాసా శాస్త్రవేత్తలు పలు విధాలుగా ప్రయత్నించారు. అయితే చంద్రుడిపై రాత్రి సమయం రావడంతో వారి ప్రయత్నాలకు విఘాతం కలిగింది. మరోవైపు ల్యాండర్‌ చంద్రుడిని గట్టిగా తాకి ఉంటుందని.. అందుకే సంకేతాలు నిలిచిపోయాయని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ల్యాండర్ నుంచి ఏ సమాచారం రానప్పటికీ.. ఆర్బిటర్ మాత్రం బాగా పనిచేస్తోందని ఇస్రో చైర్మన్ కె.శివన్ తాజాగా వెల్లడించారు. అలాగే మరో చంద్రయాన్ మిషన్‌ ప్రయోగంపై యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.