Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

చంద్రునిపై జీవం.. నాసా మరో ప్రయోగం

Titan Planet, చంద్రునిపై జీవం.. నాసా మరో ప్రయోగం

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శనిగ్రహం చందమామగా పిలిచే టైటాన్‌‌పై పరిశోధనల కోసం ఓ డ్రోన్‌ను పంపబోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఓ గ్రహంపైకి ఇలా ఎగిరే డ్రోన్‌ను పంపడం ఇదే తొలిసారని వారు పేర్కొన్నారు. కారు సైజ్‌లో ఉండబోతున్న ఈ డ్రోన్‌కు పెద్ద పెద్ద మూలకాలను గుర్తించే కొన్ని పరికారాలను అమర్చనున్నారు. 2026లో ఈ ప్రయోగాన్ని ప్రారంభించనుండగా.. 2034లో అది గమ్యస్థానాన్ని చేరుకుంటుందని.. ఆ తరువాత కొన్ని మైళ్ల దూరం ఆ డ్రోన్ ప్రయాణించనుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

దీనిపై నాసాకు చెందిన శాస్త్రవేత్త థామస్ జుర్‌బెచెన్ మాట్లాడుతూ.. సైన్స్ చాలా అభివృద్ధి చెందుతోంది… ఈ ప్రయోగాన్ని చేయడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నామని పేర్కొన్నాడు. కాగా బుధ గ్రహానికంటే పెద్దదైన టైటాన్‌ భౌగోళికంగా భూమికి దగ్గరగా ఉంటుంది. అంతేకాదు హైడ్రోకార్బన్‌లతో కూడిన నదులు, సరస్సులు ఆ గ్రహంపై అధికంగా ఉన్నాయి. అలాగే చంద్రగ్రహంపైన గడ్డ కట్టిన ఉపరితలం కింద సముద్రం కూడా ఉండవచ్చునన్నది నాసా అంచనా. అయితే భూవాతారణానికి అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ.. మనిషి మనుగడను కొనసాగించేందుకు అక్కడ అన్ని సహజవనరులు ఉన్నాయని మరో శాస్త్రవేత్త లోరి గ్లేజ్ అన్నారు. దీంతో పాటు గ్రహాంతర జీవుల ఉనికిపై కూడా ఈ పరిశోధనలు చేయడానికి ఈ ప్రయోగం దోహదపడుతుందని భావిస్తున్నారు.

Related Tags