చంద్రుడిపైకి 2024లో వ్యోమ‌గాముల‌ుః నాసా

మరోసారి చంద్రుడిపై కాలు మోపేందుకు మానవ ప్రయత్నాలు మొదలయ్యాయి. చంద్రుడిపైకి 2024లో వ్యోమ‌గాముల‌ను పంప‌నున్న‌ట్లు నాసా స్పష్టం చేసింది.

చంద్రుడిపైకి 2024లో వ్యోమ‌గాముల‌ుః నాసా
Follow us

|

Updated on: Sep 22, 2020 | 3:11 PM

మరోసారి చంద్రుడిపై కాలు మోపేందుకు మానవ ప్రయత్నాలు మొదలయ్యాయి. చంద్రుడిపైకి 2024లో వ్యోమ‌గాముల‌ను పంప‌నున్న‌ట్లు నాసా స్పష్టం చేసింది. చంద్రుడిపైకి మ‌ళ్లీ వ్యోమ‌గాముల‌ను పంపేందుకు ఫ్లాన్ చేసింది. ఇందుకు సంబంధించిన ప్ర‌ణాళిక‌ల‌ను సోమ‌వారం నాసా వెల్ల‌డించింది. దీని కోసం 28 బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నున్నట్లు వెల్లడించింది. ఇందులో 16 బిలియ‌న్ల డాల‌ర్ల‌ను కేవ‌లం చంద్రుడిపై దిగే మాడ్యూల్‌కు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకే చెప్పినప్పటికీ దీనికి ఉభ‌య స‌భ‌లు ఆమోదించాల్సి ఉందని నాసా తెలిపింది.

ఆర్టెమిస్ మిష‌న్ ద్వారా మాన‌వుల‌ను చంద్రుడి మీద‌కు పంప‌నున్న‌ట్లు నాసా అడ్మినిస్ట్రేట‌ర్ జిమ్ బ్రిడెన్‌స్టైన్ తెలిపారు. చంద్రుడిపై ద‌క్షిణ ధృవం వైపు వెళ్ల‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మూన్ మిష‌న్ కోసం మూడు విభిన్న ప్రాజెక్టులు రూపకల్పన జరుగుతుందన్న ఆయన ఇద్ద‌రు వ్యోమ‌గాముల‌ను చంద్రుడిపైకి పంపుతామ‌ని, దాంట్లో ఓ మ‌హిళా వ్యోమ‌గామి కూడా ఉండబోతున్నట్లు ఆయ‌న తెలిపారు. ఓరియ‌న్ వెస‌ల్ ద్వారా ఆ వ్యోమ‌గామి నింగిలోకి పయనం కానుంది.

ఇందుకు ట్రయల్స్ లో భాగంగా మాన‌వ‌ర‌హిత ఆర్టెమిస్ 1 వ్యోమ‌నౌక‌ను 2021లో ప్ర‌యోగించేందుకు నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త త‌ర‌హా ఎస్ఎల్ఎస్ రాకెట్ ద్వారా ఈ ప్ర‌యోగం నిర్వ‌హించనున్నారు. ఇందుకోసం ఓరియ‌న్ క్యాప్సూల్ వాడ‌నున్నట్లు సమాచారం. 2023లో రెండ‌వ ఆర్టెమిస్ రాకెట్‌ను ప్ర‌యోగించనున్నట్లు సమాచారం. ఆ వ్యోమ‌నౌక‌లో వ్యోమ‌గాములు ఉన్నా.. అది మాత్రం చుంద్రుడిపై దిగ‌దు. ఇక చివ‌ర‌గా ఆర్టెమిస్-3ను ప్ర‌యోగిస్తారు. ఇది 1969లో వెళ్లిన అపోలో 11 త‌ర‌హా ఉండనున్నట్లు తెలుస్తోంది. అమెరికా్కు చెందిన వ్యోమ‌గాములు ఆ నౌక‌లో వెళ్తారని నాసా వెల్లడించింది. సుమారు వారం రోజుల పాటు ఆర్టెమిస్‌-3 చంద్రుడిపై ఉండే అవ‌కాశాలు ఉన్నట్లు సమాచారం.

'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు