‘అంతరిక్షంలో కూరగాయల సాగు’, ముల్లంగితో మొదలు ! నాసా వినూత్న ప్రయోగం .!

గురుత్వాకర్షణ శక్తి (మైక్రోగ్రావిటీ) అతి తక్కువగా ఉండే అంతరిక్షంలో కూరగాయల సాగుపై అమెరికాలోని నాసా దృష్టి పెట్టింది. అంగారక, చంద్రగ్రహాలపై కాలు మోపేందుకు తహతహలాడుతున్న నాసా ఇక భవిష్యత్తులో వ్యోమగాముల కు ఫ్రెష్ ఫుడ్ లభించేలా చూడాలన్నది కూడా ఈ సంస్థ లక్ష్యమైంది.

'అంతరిక్షంలో కూరగాయల సాగు', ముల్లంగితో మొదలు ! నాసా వినూత్న ప్రయోగం .!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 02, 2020 | 1:21 PM

గురుత్వాకర్షణ శక్తి (మైక్రోగ్రావిటీ) అతి తక్కువగా ఉండే అంతరిక్షంలో కూరగాయల సాగుపై అమెరికాలోని నాసా దృష్టి పెట్టింది. అంగారక, చంద్రగ్రహాలపై కాలు మోపేందుకు తహతహలాడుతున్న నాసా ఇక భవిష్యత్తులో వ్యోమగాముల కు ఫ్రెష్ ఫుడ్ లభించేలా చూడాలన్నది కూడా ఈ సంస్థ లక్ష్యమైంది. విటమిన్లు, ఖనిజాలతో కూడిన మొక్కలను అంతరిక్షంలో నాటి వ్యోమగాములకు ‘హోమ్లీ ‘ టచ్ ఇస్తామని నాసా శాస్త్రజ్ఞులు అంటున్నారు. తక్కువ సమయంలోనే కల్టివేట్ అవుతాయన్న ఉద్దేశంతో ముల్లంగిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది.  పైగా స్పేస్ లో తరచు అధ్యయనం చేసే జన్యుపర మొక్కలవంటి వాటితో ముల్లంగిని కూడా పోల్చవచ్చునట !ఉదాహరణకు ‘పిల్లోల’ (దిండ్లు) మాదిరి ఉండే సాధనాల్లో న్యూట్రిషియస్  రాడిష్ ను పెంచితే మేలని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. వీటి శాంపిల్స్ ను అధ్యయనం కోసం తిరిగి భూమికి పంపనున్నారు,. తేలికైన మట్టి, తేమతో కూడిన పిల్లో సాధనాల్లో ఈ మొక్కల పెంపకాన్ని పర్యవేక్షించేందుకు 180 సెన్సర్లు, కెమెరాలను అమరుస్తున్నామని వీరు తెలిపారు. ఉష్ణోగ్రత కోసం ఎల్ ఈడీ లైట్లను కూడా వినియోగిస్తామన్నారు.

మిషన్ ఆల్ఫా పేరిట వచ్ఛే ఏడాది చేపట్టే అంతరిక్ష కార్యక్రమంలో థామస్ అనే వ్యోమగామి రోదసియానం చేయనున్నాడు. బహుశా అంతరిక్షంలో   పెరిగిన ముల్లంగి నమూనాలను ఆ వ్యోమగామి తేవచ్చు.