మానవ నివాసానికి మరో గ్రహం దొరికిందా..!

NASA discovers, మానవ నివాసానికి మరో గ్రహం దొరికిందా..!

మనుషులు జీవించేందుకు సౌర కుటుంబంలో భూమిని పోలిన గ్రహం ఏదైనా ఉందేమోనని కొన్ని సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రయోగంలో వారు విజయవంతం అయ్యారు. మనుషులు జీవించేందుకు అణువుగా ఉండే సరికొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సౌర వ్యవస్థ ఆవల ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న ఆ గ్రహంపై జీవం, ద్రవరూప నీరు ఉన్నట్లు నిర్ధారించకపోయినప్పటికీ.. వాటి ఉనికికి పుష్కల అవకాశాలున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహానికి జీజే 357 డీ అనే నామకరణం చేశారు. దీన్ని నాసాకు చెందిన ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే ఉపగ్రహం(టెస్)ఈ ఏడాది ఫిబ్రవరిలో గుర్తించింది. సూర్యుడిలో మూడో వంతు పరిమాణంలో ఉండే ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ జీజే 357 డీతో పాటు జీజే 357 బీ, జీజే 357 సీ అనే మరో రెండు ఉపగ్రహాలు తిరుగుతున్నాయి. భూమితో పోలిస్తే జీజే 357 డీ ద్రవ్యరాశి ఎక్కువ కాగా.. దీన్ని సూపర్ ఎర్త్‌గా పరిగణిస్తున్నారు. ఈ గ్రహంపై వాతావరణం చాలా బావుందని.. భూమిలాగే అక్కడ ద్రవరూప నీరు ఉండేందుకు అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. త్వరలో అందుబాటులోకి వచ్చే అత్యాధునిక టెలిస్కోపులతో ఈ గ్రహంపై జీవం ఉనికిని గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *