విశాఖలో టన్నుల కొద్దీ గంజాయి.. సీజ్ చేసిన పోలీసులు

విశాఖ‌ప‌ట్నం ఏజెన్సీలో మ‌రోసారి గంజాయి కలకలం రేపింది. విశాఖ ఏజెన్సీ నుంచి ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు అక్ర‌మంగా తరలిస్తున్న ట‌న్నుల కొద్ది గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున గంజాయి వెలుగు చూడ‌టంతో పోలీసుల‌ు షాక్ తిన్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ కంటైనర్ గంజాయి లోడుతో బయలు దేరింది. తవుడు బస్తాల మధ్యలో గంజాయిని పెట్టి స్మగ్లర్లు మూడో కంటికి తెలియకుండా గంజాయిని తరలిస్తున్నారు. కంటైనర్‌లో బస్తాల్లో ఉన్న గంజాయి మొత్తం 2500కిలోలు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ సుమారు రెండున్నర కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కంటైనర్ ను సీజ్ చేసి.. ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *