IPL 2020: కోల్‌కతా టీమ్‌కి గుడ్‌న్యూస్‌.. నరైన్‌కి ఊరట

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌కి ఐపీఎల్‌ బౌలింగ్ యాక్షన్ కమిటీ ఊరటను కలిగించింది. ఆ టీమ్‌కి చెందిన ప్రముఖ బౌలర్‌ సునీల్‌ నరైన్‌ని వార్నింగ్‌ లిస్ట్‌ నుంచి తీసేస్తున్నట్లు తెలిపింది.

IPL 2020: కోల్‌కతా టీమ్‌కి గుడ్‌న్యూస్‌.. నరైన్‌కి ఊరట
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 3:32 PM

Sunil Narine IPL: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ టీమ్‌కి ఐపీఎల్‌ బౌలింగ్ యాక్షన్ కమిటీ ఊరటను కలిగించింది. ఆ టీమ్‌కి చెందిన ప్రముఖ బౌలర్‌ సునీల్‌ నరైన్‌ని వార్నింగ్‌ లిస్ట్‌ నుంచి తీసేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐపీఎల్‌ ఓ ప్రకటనను చేసింది. కాగా అక్టోబర్ 10న పంజాబ్‌, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా నరైన్ బౌలింగ్ వేశారని ఆన్‌ఫీల్డ్ అంపైర్లు క్రిస్‌ గఫెనీ, ఉల్హాస్ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. దాంతో అతడిని హెచ్చరిక జాబితాలో ఉంచారు. మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే తమ నుంచి క్లియరెన్స్ వచ్చే వరకు సునీల్‌కి బౌలింగ్ వేసే అవకాశం ఉండదని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. దీంతో రెండు మ్యచ్‌లకు అతడు దూరంగా ఉన్నారు.

ఇక అతడి బౌలింగ్‌కి సంబంధించిన వీడియోను చూసి నిర్ణయం తీసుకోవాలంటూ ఇటీవల కోల్‌కతా టీమ్‌, ఐపీఎల్‌ బౌలింగ్ యాక్షన్ కమిటీని కోరింది. దాన్ని అన్ని కోణాల్లో చూసిన యాక్షన్ కమిటీ సునీల్‌ని హెచ్చరిక జాబితా నుంచి తీసివేస్తున్నట్లు తెలిపింది. దీంతో కోల్‌కతా టీమ్ ఊపిరి పీల్చుకుంది. కాగా ప్రస్తుతం కోల్‌కతా టీమ్‌ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ టీమ్‌కి కెప్టెన్సీ నుంచి దినేష్ కార్తీక్‌ ఇటీవల తప్పుకోవడంతో.. ఇయాన్ మోర్గాన్ ఆ బాధ్యతలను తీసుకున్నారు.

Read More:

నెల రోజుల తరువాత చీరను మార్చిన నటి

రిక్కీ మాటలకు పంత్‌ ఎక్స్‌ప్రెషన్స్‌.. నవ్వులు పూయిస్తోన్న వీడియో