మోదీ కేబినెట్‌లో మంత్రుల ఆస్తులు ఎంతంటే..!

మే 30వ తేదీన 57 కేంద్రమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ 57 మంత్రులలో దాదాపు 22 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటు 51 మంత్రులు కోటీశ్వరులు కాగా.. అందులో మోదీ ర్యాంక్ 46. ఇక అసలు వివరాల్లోకి వెళ్తే కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ దాదాపు 217 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రైల్వే మంత్రి పీయూష్ గోయల్ 95 […]

మోదీ కేబినెట్‌లో మంత్రుల ఆస్తులు ఎంతంటే..!
Follow us

|

Updated on: Jun 01, 2019 | 9:17 AM

మే 30వ తేదీన 57 కేంద్రమంత్రులతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ 57 మంత్రులలో దాదాపు 22 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అటు 51 మంత్రులు కోటీశ్వరులు కాగా.. అందులో మోదీ ర్యాంక్ 46.

ఇక అసలు వివరాల్లోకి వెళ్తే కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ దాదాపు 217 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రైల్వే మంత్రి పీయూష్ గోయల్ 95 కోట్లతో రెండో స్థానం దక్కించుకోగా.. రావ్ ఇంద్రజిత్ సింగ్ 42 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా(40 కోట్లు), ప్రధానమంత్రి నరేంద్రమోదీ(2కోట్లు) కలిగి ఉన్నారు. మరోవైపు ఐదు మంత్రులు తమ ఆస్తి కోటిలోపు ఉందని పేర్కోగా.. కేంద్రమంతి ప్రతాప్ చంద్ర సారంగీ మాత్రమే 13 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు.

కాగా ఈ మంత్రుల విద్యార్హత గురించి ప్రస్తావిస్తే 8 మంది మంత్రులు 10వ తరగతి, 12వ తరగతి పాసైతే.. 47 మంది తమ విద్యార్హత డిగ్రీగా పేర్కొన్నారు.ఇలా సరికొత్తగా ఏర్పడిన మోదీ కేబినెట్ మున్ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.