Breaking: మోదీ ప్రసంగం.. లాక్‌డౌన్ 4.0 తప్పనిసరి

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రుల నుంచి ఈ నెల 15వ తేదీలోగా వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని మే 17వ తేదీ లోగా నాలుగో విడత లాక్ డౌన్ విధివిధానాలను వెల్లడిస్తామని వివరించారు. స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా కట్టడికి మార్గమని ఆయన అన్నారు. ఈ యుద్ధాన్ని గెలిచి తీరాలని ఆయన అన్నారు. జీవన్మరణ యుద్ధంలో భారత […]

Breaking: మోదీ ప్రసంగం.. లాక్‌డౌన్ 4.0 తప్పనిసరి
Follow us

| Edited By:

Updated on: May 12, 2020 | 10:09 PM

కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రుల నుంచి ఈ నెల 15వ తేదీలోగా వచ్చే సూచనలను పరిగణలోకి తీసుకుని మే 17వ తేదీ లోగా నాలుగో విడత లాక్ డౌన్ విధివిధానాలను వెల్లడిస్తామని వివరించారు. స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనా కట్టడికి మార్గమని ఆయన అన్నారు. ఈ యుద్ధాన్ని గెలిచి తీరాలని ఆయన అన్నారు. జీవన్మరణ యుద్ధంలో భారత ఔషదాలు ఆశాకిరణంగా మారాయని మోదీ పేర్కొన్నారు. భారత పురోగతే ప్రపంచ పురోగతిగా మారిందని ఆయన వెల్లడించారు. కరోనా సంక్షోభం తరువాత మారుతున్న ప్రపంచాన్ని చూస్తున్నామని.. 21వ శతాబ్దం భారత్‌దేనని ఆయన పునరుద్ఘాటించారు. భారతీయులంతా స్థానిక ఉత్పత్తులనే వాడాలని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి ‘స్థానికం’ను మన జీవన మంత్రగా మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read This Story Also: షాకింగ్.. ఆకలితో అలమటిస్తోన్న 82కోట్ల మంది..!