ప్రత్యేక హోదాపై తగ్గేది లేదు… జగన్!

Narendra Modi, ప్రత్యేక హోదాపై తగ్గేది లేదు… జగన్!

వైసీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్‌కు ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఘనస్వాగతం లభించింది.. భవన్‌లో జగన్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ఏపీ భవన్ అధికారులు జగన్‌ను కలిసి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఉద్యోగులు, ఏపీ భవన్‌కు వచ్చిన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. ప్రధానితో రాష్ట్రంలోని పరిస్థితులను వివరించామని జగన్ తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం చాల అవసరం అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో 2570 లక్షల కోట్ల అప్పులయ్యాయని వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రధాని మోదీకి వివరించానని జగన్ స్పష్టంచేశారు. రాష్ట్ర సమస్యలపై మోదీ సానుకూలంగా స్పందించారని జగన్ తెలిపారు.

కాగా…అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. నరేంద్రమోదీతో వైసీపీ అధినేత, ఏపీ కాబోయే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. దాదాపు గంటా 20 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలోని సమస్యలను జగన్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారివురి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని మోదీ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. జగన్‌తో జరిగిన భేటీపై మోదీ తెలుగులో ట్వీట్‌ చేయడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. ఈ నెల 30న జరిగే తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వారిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *