Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

మాల్దీవుల్లో మోదీకి అపూర్వ స్వాగతం!

Narendra Modi, మాల్దీవుల్లో మోదీకి అపూర్వ స్వాగతం!

ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులకు చేరుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మాలే చేరుకున్న మోదీకి మాలే విమానాశ్రయంలో విదేశాంగ మంత్రి అబ్దుల్ షాహిద్ సహా పలువురు ప్రముఖులు సాదర స్వాగతం పలికారు. ప్రధాని తన మొదటి ఐదు సంవత్సరాల పాలనలో పలు విదేశీ పర్యటనలు చేసినప్పటికీ పొరుగు దేశమైన మాల్దీవుల్లో పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టగానే తొలుత మాల్దీవుల్లో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మాల్దీవుల పర్యటలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ‘రూల్ ఆఫ్ నిషాన్ ఐజుద్దీన్’‌ పురస్కారాన్ని మోదీ అందుకోనున్నారు. కాగా, శనివారంనాడు మాలే చేరుకున్న మోదీకి రిపబ్లిక్ స్క్వేర్‌ వద్ద మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మొహ్మద్ సోలిహ్ స్వాగతం పలికారు. మాల్దీవుల పర్యటనలో భాగంగా సోలిహ్, ఉపాధ్యక్షుడు ఫైజల్ నసీమ్, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్‌లను కలుసుకుంటారు. హిందూ మహాసముద్రం భద్రత, తీరప్రాంత సహకారం పటిష్టతపై ప్రధాని ప్రధానంగా దృష్టిసారించనున్నారు. తీరప్రాంత నిఘా రాడార్ సిస్టమ్‌ను ప్రారంభిస్తారు.