Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పోలీసుల అదుపులో 25 మంది స్ట్రీట్ ఫైటర్లు.. పండుగ్యాంగ్ లొ గుంటూరు, మంగళగిరి చెందిన యువకులు ఉన్నట్టు తేల్చినా పోలీసులు.. పాతనేరస్థుల పైనా అనుమానాలు..
  • ఇంటర్ బోర్డ్ , ఎగ్జామినర్ ల మధ్య బస్ ఛార్జ్ ల లొల్లి. పేపర్ వాల్యుయేషన్ కి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్ లు ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డ్ . ఎగ్జామినర్ ల నుండి ఆ టైం లో ఛార్జ్ లు వసూలు చేయని ఆర్టీసీ. ఇంటర్ బోర్డ్ ఆర్టీసీ కి రాసిన లేఖతో టికెట్ ఛార్జ్ లు తీసుకొని ఆర్టీసీ . ఇప్పుడు ఛార్జ్ లు కట్టాలని అంటున్న ఇంటర్ బోర్డ్ .
  • పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు నివేదికలో విద్యా శాఖ. పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచాం. పదో తరగతి విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లవుజులు సేకరించి కేంద్రాలకు పంపించాం. కేంద్రానికి ఒకరు చొప్పున 4,535 మంది వైద్య సిబ్బంది. డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
  • తెలుగు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు అమెరికాలోని భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియామకం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం వాషిగ్టంట్ (డీసీ)లోని రాయబార కార్యాలయంలో విధులు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న రవి కోట.
  • తిరుమల: నేడు తిరుమల శ్రీవారి దర్శనాలపై విధి విధానాలు ప్రకటించనున్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తొలి రెండు రోజులు టిటిడి ఉద్యోగుల, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో ట్రయల్ రన్ నిర్వహించనున్న టిటిడి. మూడో రోజు తిరుమలలో ఉన్న స్థానికులతో ట్రయల్ రన్. ఆన్ లైన్లో టిటిడి వెబ్ సైట్ ద్వారా టైం స్లాట్ బుకింగ్. భక్తుల సంఖ్య, వసతి గదుల కేటాయింపు, రవాణా, ప్రసాద విక్రయాల పై , ధర్మల్ స్క్రీనింగ్ అన్న ప్రసాద ప్రారంభం పై స్పష్టత నివ్వనున్న టిటిడి..
  • తాడేపల్లి : తాడేపల్లి లో గల ఉండవల్లి సెంటర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేట లో ఈరోజు 4 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు. కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.

చిరు, నాగ్ ల‌కు థ్యాంక్స్..తెలుగులో ప్ర‌ధాని ట్వీట్..

Narendra Modi tweets in Telugu to thank Chiranjeevi Nagarjuna Varun Tej for Corona awareness song, చిరు, నాగ్ ల‌కు థ్యాంక్స్..తెలుగులో ప్ర‌ధాని ట్వీట్..

కరోనా మహమ్మారి ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. మ‌నదేశంలో కూడా ఈ వైర‌స్ ఇప్పుడిప్పుడే ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. ప్ర‌ధాని ముందు జాగ్రత్త చర్యగా 21 రోజులపాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ పిల‌పునివ్వ‌డంతో ప్ర‌జ‌లు ఇళ్లకే ప‌రిమిత‌మై, సామాజిక దూరం పాటించి వ్యాధి వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌గ‌లిగారు.

అయితే కొంద‌రు మాత్రం క‌రోనాను లైట్ తీసుకుంటున్నారు. విచ్చ‌ల‌విడిగా రోడ్డుపైకి వ‌చ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. అందుకే దేశ‌వ్యాప్తంగా సెల‌బ్రిటిస్ వారికి సోష‌ల్ మీడియా ద్వారా అవ‌గాహ‌న క‌లిపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో పాట‌ల రూపంలో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే భాష‌లో చెప్ప‌డానికి అగ్ర‌క‌థానాయ‌కులు మంచి ప్ర‌యత్నాలు చేశారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ కోటి సార‌థ్యంలో చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సంయుక్తంగా చేసిన పాట జ‌నంలోకి బాగా వెళ్లింది. ఈ సాంగ్ వీడియోను డీడీ న్యూస్ ఏప్రిల్ 2న ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను శుక్ర‌వారం చూసిన ప్రధాన మంత్రి వెంటనే స్పందించారు. తెలుగు భాషలో ట్వీట్ చేశారు.

‘‘చిరంజీవిగారికి, నాగార్జునగారికి, వరుణ్ తేజ్‌కి, సాయి ధరమ్ తేజ్‌కి మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం. అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్‌పై విజయం సాధిద్దాం’’ అని తన ట్వీట్‌లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

Related Tags