Breaking News
  • నేడు, రేపు అమరావతిలో మహిళా జేఏసీ నేతల పర్యటన. రాజధాని ప్రాంతంలో దీక్షలకు సంఘీభావం తెలపనున్న.. అమరావతి పరిరక్షణ సమితి మహిళా జేఏసీ.
  • నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఎన్నికల నోటిఫికేషన్‌. 25న డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు. 29న చైర్మన్‌, ఉపాధ్యక్ష ఎన్నికలు.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం.
  • ఈ నెల 26 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు. మార్చి 7 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణ.
  • ఏపీలో విద్యుత్‌ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు కసరత్తు. ప్రీపెయిడ్‌ విధానాన్ని తీసుకురానున్న విద్యుత్‌ సంస్థలు. జూన్‌ నాటికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసే యోచన.

పీవోకే సొంతానికి మోదీ నయా ప్లాన్.?

Modi Government Plans For POK, పీవోకే సొంతానికి మోదీ నయా ప్లాన్.?

దాయాది పాకిస్థాన్‌తో చర్చలకంటే యుద్ధమే కరెక్ట్ అనే దిశగా మోదీ సర్కార్ ఒక్కో అడుగు వేస్తున్నట్లు సమాచారం. గత పాలకుల చేతకానితనం వల్ల ఇప్పటివరకు ఆత్మరక్షణలో పడుతూ వచ్చిన ఇండియా.. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మోదీ పుణ్యమా అని పాకిస్థాన్‌కు షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే ఆర్టికల్ 370ని రద్దు చేసిన మోదీ ప్రభుత్వం.. పీవోకేను సొంతం చేసుకోవడానికి నయా ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

పాక్ ఆక్రమించిన పీవోకేను భారత్ సొంతం చేసుకుంటుందని.. త్వరలోనే భారత త్రివర్ణ పతాకం అక్కడ ఎగురుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  మొదలుగుని ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ఆర్మీ చీఫ్ తదితరులు వరుసగా ప్రకటనలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గతానికి భిన్నంగా భారత్ తీరుతో పాక్ ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. కశ్మీర్ విషయంపై నోరు మెదపడం అటుంచి.. తాము ఆక్రమించిన ముజఫర్ నగర్‌ను కాపాడుకోవడానికి ప్లాన్స్ సిద్ధం చేస్తోంది.

పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితే.. దానికి తగ్గట్టుగానే దాయాది దేశం ఊహించని విధంగా ఎదురుదాడి చేసేందుకు మోదీ సర్కారు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పాక్ ప్రస్తుతం డిఫెన్స్‌లో పడిందని సమాచారం. ఇక పీవోకేను సొంతం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నా.. సరైన తరుణం కోసం వేచి చూస్తోందన్న మాట వినిపిస్తోంది. పుల్వామా తరహాలో పాక్ ఏదైనా కవ్వింపు చర్యకు పాల్పడితే.. పీవోకేపై భారత్ దాడి చేసేందుకు సిద్ధంగా ఉందంటున్నారు. ఇందుకోసం అంతర్జాతీయ మద్దతును కూడా మోదీ సర్కారు కూడగడుతోందట.

ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ అంతర్జాతీయంగా చాలా విమర్శలు ఎదుర్కుంటోంది.. అంతేకాక ఆర్ధికంగా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటోందని తెలుస్తోంది. యూరీ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్‌ను నిర్వహించటం తెలిసిందే. ఈ ఘటనకు పాక్ నుంచి సరైన ప్రతిస్పందన లేకపోవటంతో భారత్ మరింత ధైర్యాన్ని పుంజుకుందన్న మాట వినిపిస్తోంది.

గతంలో ఎప్పుడూ లేని విధంగా మోదీ సర్కారు పీవోకే‌ భారత అంతర్భాగమని వాదిస్తోంది. దానికి తగ్గట్టుగానే తాజాగా విదేశాంగ మంత్రి జై శంకర్ ఇటీవల మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీర్ఘకాలం అవసరమయ్యే ఆయుధాల కొనుగోళ్లను పక్కన పెట్టిన భారత్.. తక్షణం యుద్ధం వస్తే అవసరమయ్యే ఆయుధాల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం వెనుక అసలు విషయం.. పీవోకేను సొంతం చేసుకోవటమే అని తెలుస్తోంది.

Related Tags