Breaking News
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
  • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
  • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
  • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
  • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

చంద్రబాబు అనుభవం ఏంటో అర్ధమైందా… జగన్ సర్కార్‌కు ట్వీట్

Nara Lokesh Tweets On YCP Govt, చంద్రబాబు అనుభవం ఏంటో అర్ధమైందా… జగన్ సర్కార్‌కు ట్వీట్

మండలిలో వికేంద్రీకరణ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య శక్తి ఎంతటిదో..చంద్రబాబుగారి అనుభవం ఏంటో అధికార పక్షానికి తెలిసొచ్చిందన్నారు. మండలిలో వికేంద్రీకరణ బిల్లును.. టీడీపీ విజయవంతంగా సెలెక్ట్‌ కమిటీ బాట పట్టించగలిగిందన్నారు. ఇది రాజధాని రైతుల ఆకాంక్ష అంటూ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మరోవైపు వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అటు అమరావతి రైతులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు బయటకు రాగానే..ఆయనకు శాలువాలు కప్పుతూ అభినందించి..కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు వెంట ర్యాలీ తీశారు. నారా లోకేష్‌, ఎమ్మెల్యే బాలకృష్ణను కార్యకర్తలు అభినందలతో ముంచెత్తారు. జై బాలయ్య.. జై లోకేష్‌ అంటూ నినాదాలు చేశారు. అటు రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల పెద్ద ఎత్తున టపాసుల్ని కాల్చారు.

Related Tags