పోలవరం రద్దు తుగ్లక్ చర్య.. లోకేశ్ ట్వీట్

Nara lokesh tweet on polavaram project tender cancilletion, పోలవరం రద్దు తుగ్లక్ చర్య.. లోకేశ్ ట్వీట్

పోలవరం ప్రాజెక్టు టెండర్ రద్దు చేయడంపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర మంత్రి పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఒకవైపు ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం చెబుతుంది. అందుకోసమే టెండర్ రద్దు చేశామని చెబుతుంటే ఇలా చేయడం వల్ల వ్యయం మరింత పెరుగుతుందని కేంద్ర చెబుతోంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై టీడీపీ నేత లోకేశ్ ఏపీ ప్రభుత్వ చర్యపై ఘాటుగా ట్వీట్ చేశారు. ఇది తుగ్లక్ చర్య అంటూ మండిపడ్డారు. తుగ్లక్ గారూ ఇది విన్నారా? పోలవరం టెండర్లు రద్దు చెయ్యడం బాధాకరం , మీ తుగ్లక్ చర్యతో ప్రాజెక్టు ఆలస్యం అవుతోంది. ఖర్చుకూడా పెరుగుతుంది అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు లోక్‌సభలో చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన ప్రతి రూపాయికి ఒక లెక్క ఉంది అంటు ట్వీట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *