ఇదేనా మీ రాజన్న రాజ్యం? -లోకేశ్‌

, ఇదేనా మీ రాజన్న రాజ్యం? -లోకేశ్‌

అమరావతి: టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. దౌర్జన్యాలతో తెలుగుదేశం పార్టీ  కేడర్‌ సహనాన్ని పరీక్షించవద్దని ట్విటర్‌ వేదికగా హెచ్చరించారు. గెలుపు అనేది బాధ్యత పెంచాలి తప్ప అరాచకాలకు మార్గం కాకూడదని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు.

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీకి ఓటు వేశారని రైతులను ఐదేళ్లు గ్రామ బహిష్కరణ చేశారని ఆయన ఆరోపించారు. నెల్లూరు వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీలో పేదల గుడిసెలు కూల్చడానికి ప్రయత్నించారని మండిపడ్డారు. ‘ మా కార్యకర్తలపై 100పైగా దాడులకు పాల్పడ్డారు. ఇదేనా మీరు చెప్పిన రాజన్న రాజ్యం?’ అంటూ ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించి ఇకనైనా ఇలాంటి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.

]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *