Breaking News
  • హైదరాబాద్‌: తార్నాకలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ సదస్సు. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.
  • ప్రకాశం జిల్లా మార్టూరుకు బయల్దేరిన చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు.
  • కడప: రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
  • వరంగల్‌లో వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ గోదావరి యాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో సమావేశం. గోదావరి జలాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు.
  • అమరావతి: చంద్రబాబు భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు-యనమల రామకృష్ణుడు. ఈ విషయంపై మండలిలో చర్చిస్తాం. అవసరమైతే ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం-యనమల రామకృష్ణుడు.
  • నిర్మల్‌: మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు. మంత్రితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపూరావు.

మండలి రద్దు అంశంపై స్పందిస్తూ.. జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన లోకేష్..

Nara Lokesh Comments on AP CM YS Jagan, మండలి రద్దు అంశంపై స్పందిస్తూ.. జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన లోకేష్..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ శాసన మండలిని రద్దు చేయడం అంటే.. మరో తుగ్లక్ నిర్ణయం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. జగన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి రద్దు అంశం, పునరుద్ధరణకు ఇప్పటికే కేంద్రం వద్ద రెండేళ్ల నుంచి రాష్ట్రాల తీర్మానాలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో బిల్లులన్నీ ఓ క్రమపద్దతిలో వస్తాయని.. రాష్ట్రం తీర్మానం పంపిందని వెంటనే రద్దు చేయరన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. అసలు మండలి రద్దు.. ఎందుకు చేస్తున్నారన్న కారణాలు ప్రభుత్వం చెప్పాలన్నారు. రాష్ట్రపతి గెజిట్ వచ్చే వరకు కౌన్సిల్ ఉంటుందని నారా లోకేష్‌ వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. మండలితో దండగ ఖర్చుతో పాటు అభివృద్ధిని అడ్డుకుంటోందని సీఎం జగన్ ఇప్పటికే అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ మండలి రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తే.. ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమవారం ఉదయం జరిగే కేబినెట్‌ భేటీలో శాసనమండలి రద్దుపై చర్చించనున్నారు. అసెంబ్లీలో రద్దు తీర్మానం ప్రవేశపెడితే.. కీలక చర్చ జరగనుంది. తీర్మానంపై ఓటింగ్ జరిగితే.. ప్రభుత్వానికి మెజార్టీ ఉండటంతో ఆమోదం లభిస్తుంది. అనంతరం ఆ తీర్మాన బిల్లును కేంద్రానికి పంపనున్నారు.

Related Tags