లోకేశ్‌తో వల్లభనేని అమీతుమీ: వాటితో పోలికా? హవ్వ!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. సంతలో గొర్రెలు ఎవరు..?వాటిని కొన్నది ఎవరు.? అన్నది టైటిల్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను తాను సంత‌లో గొర్రెల్లా ఎలా కొన్నాడో YS Jagan Mohan Reddy గారు చెబుతున్నారు వినండి. జ‌గ‌న్ గారి మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే గొర్రెల‌తోపాటు గొర్రెల డాక్ట‌ర్‌నీ కొన్నారు. ఈ వీడియోలో సిఎం జగన్మోహనరెడ్డి మాట్లాడిన మాటలున్నాయి. “అత్యంత అవినీతి డబ్బులు విచ్చలవిడిగా రూ.20 కోట్లు, రూ.30 […]

లోకేశ్‌తో వల్లభనేని అమీతుమీ: వాటితో పోలికా? హవ్వ!
Follow us

|

Updated on: Jan 29, 2020 | 2:56 PM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. సంతలో గొర్రెలు ఎవరు..?వాటిని కొన్నది ఎవరు.? అన్నది టైటిల్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను తాను సంత‌లో గొర్రెల్లా ఎలా కొన్నాడో YS Jagan Mohan Reddy గారు చెబుతున్నారు వినండి. జ‌గ‌న్ గారి మ‌రో ప్ర‌త్యేక‌త ఏంటంటే గొర్రెల‌తోపాటు గొర్రెల డాక్ట‌ర్‌నీ కొన్నారు.

ఈ వీడియోలో సిఎం జగన్మోహనరెడ్డి మాట్లాడిన మాటలున్నాయి. “అత్యంత అవినీతి డబ్బులు విచ్చలవిడిగా రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఇచ్చి ఏ రకంగా సంతలో గొర్రెలు కొన్నట్లుగా కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితులు” అని ప్రస్తావించారు జగన్. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేతగా ఉన్న జగన్ చేసిన వ్యాఖ్యలివి. అప్పుడు సిఎంగా ఉన్న చంద్రబాబునాయుడు 23 మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకున్నారని..డబ్బులతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఆరోపించారు జగన్. ఆ మాటల క్లిప్ను తీసుకుని తన ట్విట్టర్లో పోస్టు చేశారు లోకేష్‌. ఫలితంగా ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. రాజకీయ వర్గాలలో హాట్‌ టాపిక్‌ అయ్యింది. అదే వీడియోలో జగన్మోహన్‌రెడ్డితో పాటు…గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాటల వీడియోను పెట్టారు. తాను ఎందుకు సీఎం జగన్‌ను కలిసింది అందులో వివరించారు వంశీ. ” ఈ నియోజకవర్గ పేద ప్రజల కోసం. ఇళ్ల కోసం. ఇళ్ల పట్టాల కోసం. ఆ కోరిక సఫలమవడం కోసం జగన్మోహనరెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం. ఆయన ప్రామిస్ చేశారు. ఆయనతో కలిసి నడుస్తాను” అన్నారు వల్లభనేని వంశీ. ఇప్పుడు వంశీ టీడీపీ సభలు, సమావేశాలకు హాజరు కావడం లేదు. తాను టీడీపీలో ఉండనని..వారి విధానాలు నచ్చడం లేదని..కాబట్టి అసెంబ్లీలో విడిగా తనకు సీటు కేటాయించాలని వంశీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌కు విన్నవించుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా వంశీకి అసెంబ్లీలో విడిగా సీటు కేటాయించారు స్పీకర్. అప్పటి నుంచి టీడీపీ సభ్యులకు దూరంగా సభలో కూర్చుంటున్నారు వంశీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వంశీతో పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి కూడ కూర్చున్నారు. నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు తాను సీఎం జగన్‌ను కలిశానని..అందుకే విడిగా కూర్చుంటున్నానని ఆయన వంశీ చెప్పిన మాటలనే అటు ఇటుగా చెప్పారు. ఇప్పుడు వీరిద్దరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కొనుగోలు చేసింది అనే అర్థం వచ్చేలా లోకేష్ తన ట్విట్టర్‌లో ప్రస్తావించారు.

నారా లోకేష్ అలా ట్వీటారో లేదో … వల్లభనేని వంశీ రెస్పాండయ్యారు.. లోకేష్‌కు ఘాటైనా కౌంటరిచ్చారు.

‘అసలే కోతి… ఆ పైన కల్లు తాగింది… వద్దంటే మంగళగిరికి వెళ్లింది … చిత్తుగా ఓడిపోయింది… మండలికి పోయింది… ఉన్నది కాస్తా ఊడిపోయింది. ఏం చేయాలో తోచటం లేదు. అందుకే పిచ్చి కుక్క కరిస్తే అరిచినట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు… గొర్రెలకే కాదు, ఇటువంటి పిచ్చి కుక్కలకూ నా దగ్గర అత్యద్భుతమైన వైద్యం వుంది’.

అక్షరం పొల్లుపోకుండా ఇదీ లోకేష్‌కు డాక్టర్‌ వల్లభనేని వంశీ ఇచ్చిన కౌంటర్‌ రిప్లై…

2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు రాగా….టీడీపీ నుంచి 23 మంది, జనసేన పక్షాన ఒక్కరు విజయం సాధించారు. శాసనసభలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. కానీ టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి టీడీపీ ఆదేశాలను పట్టించుకోవడం లేదు. ఆ పార్టీ నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరు కావడం లేదు. అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానంపై జరిగిన చర్చకు టీడీపీ గైర్హాజరవుతున్నట్లు ముందుగానే ప్రకటించింది. కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు మద్దాలగిరి, వల్లభనేని వంశీలు శాసనసభకు హాజరయ్యారు. మండలి రద్దు తీర్మానంపై ఓటింగ్ జరిగేటప్పుడు మాత్రం వారు సభలో లేరు. వారు అలా సభకు రావడాన్ని టీడీపీ తప్పు పట్టింది. వారిద్దరినీ ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేయగా…వంశీ కౌంటరిచ్చారు. కాకపోతే లోకేష్ ను ఉద్దేశించి రాసిన రాతలు ఘాటుగానే ఉన్నాయి. మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయారు లోకేష్. మరోవైపు శాసనమండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ తీర్మానాన్ని పార్లమెంటు ఆమోదిస్తే మండలి రద్దు అవుతోంది. . ఇప్పుడున్న మండలి రద్దు అయితే ఏం చేయాలో లోకేష్‌కు తోచడం లేదని ట్విట్టర్‌లో వంశీ ప్రస్తావించారు. ఉన్నది కాస్తా ఊడింది…సర్వ మంగళం పాడింది అనే పాటలోని పల్లవిని తీసుకున్నారు వంశీ. పిచ్చి కుక్క కరిస్తే అరిచినట్లు పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారని..గొర్రెలకే కాదు..ఇటువంటి పిచ్చి కుక్కలకూ నా దగ్గర వైద్యం ఉందని చెప్పడం చర్చనీయాంశమైంది. రాజకీయ నేతలు మరీ ఇంత ఘాటుగా కామెంట్లు చేసుకుంటారా అని విస్తుపోతున్నారు ఈ ట్వీట్లు చూసిన జనాలు.

కొండవీటి శివనాగ్ రాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం