Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

వేధింపులు నిజమే.. కీచక ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు

ఆయన ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్.. పదిమందికీ విఙ్ఞానాన్ని పంచాల్సిన వాడు. కానీ అతనిలో మరో మనిషి కూడా ఉన్నాడు. సమయం చిక్కినప్పుడు.. అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం అతనికి అలవాటు. ఇదే  అతడ్ని బజారుకీడ్చేలా చేసింది.

వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ సూర్యరాఘవేంద్ర లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. రాఘవేంద్రపై వచ్చిన ఆరోపణలపై యూనివర్సిటీ అంతర్గత విచారణ చేపట్టి నిజాలు రాబట్టింది. ఈ విచారణలో  అతనిపై వచ్చిన ఆరోపణలు  నిజమేనని తేలడంతో రాఘవేంద్రను సస్పెండ్ చేస్తున్నట్టు యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రకటించారు.

యూనివర్సిటీలో ఇంగ్లీష్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న రాఘవేంద్ర.. గత కొంతకాలంగా విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించేవాడు. రాత్రి సమయాల్లో వాట్సాప్‌ మెసేజ్‌లు చేస్తూ విద్యార్ధినులను లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఇతని వేధింపులు మరీ ఎక్కువ కావడంతో నలుగురైదుగురు విద్యార్థినులు ధైర్యం చేసి ఇటీవల ఏపీ సీఎం జగన్‌కు స్వయంగా లేఖ రాశారు. రాఘవేంద్ర ఎలా ఒత్తిడి తెచ్చేవాడో, ఎటువంటి భాషతో మెసేజ్‌లు చేసేవాడో సీఎం జగన్‌కు రాసిన లేఖలో పూర్తిగా వివరించారు. దీంతో ఆయన వెంటనే స్పందించి నిజానిజాలు తెలుసుకోవాలని ఆదేశించారు. దీంతో యూనివర్సిటీలో అంతర్గత విచారణ చేపట్టి రాఘవేంద్రపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ మహిళా నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డితో పాటు పలువురు యూనివర్సిటీకి చేరుకుని రాఘవేంద్రను నిలదీశారు. ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.