అమ్మాయిలు దొంగలైతే… మరి నాని?

‘జెర్సీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో నాని ఐదుగురు మహిళలకు లీడర్‌గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ఆ అయిదుగురు అమ్మాయిలు చిన్న చిన్న దొంగతనాలు చేస్తారని సమాచారం. వారి నాయకుడిగా నాని అలరించనున్నాడట. నాని గత చిత్రాల మాదిరే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు నాని.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో యంగ్ హీరో సుధీర్ బాబు కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *