Breaking News
  • నేడు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.
  • నేటి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక డేఅండ్‌ నైట్‌ టెస్టు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్‌ ప్రారంభం.
  • హైదరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత. ఐఎంఎస్‌లో ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు. ఐఎంఎస్‌ కుంభకోణం నేపథ్యంలో.. ఔషధాల కొనుగోళ్లకు ముందుకురాని అధికారులు. ఔషధాల కొనుగోలు బాధ్యతను.. క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలనే యోచనలో ఐఎంఎస్‌.
  • హైదరాబాద్‌లో అమిటీ యూనివర్సిటీ. విద్యాశాఖకు దరఖాస్తు చేసిన అమిటీ గ్రూపు. ఇప్పటికే దేశంలోని 10 నగరాల్లో ఉన్న అమిటీ యూనివర్సిటీలు.
  • రజినీకాంత్‌ వ్యాఖ్యలకు పళనిస్వామి కౌంటర్‌. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా.. రాజకీయాల్లో అద్భుతాలపై మాట్లాడడం సరికాదు. దేని ఆధారంగా 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని.. రజినీకాంత్‌ విశ్వసిస్తున్నారో అర్థం కావడంలేదు-పళనిస్వామి.
  • గంగానది ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రక్షాళన కోసం రూ.28,600 కోట్ల వ్యయంతో.. 305 ప్రాజెక్టులను మంజూరు చేశాం. దాదాపు 109 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది -కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.
  • 2020లో సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయం.
  • గుంటూరు: 104 సిబ్బంది మధ్య ఘర్షణ. రాడ్‌తో ఫార్మసిస్ట్‌పై దాడి చేసిన డ్రైవర్‌. ఫార్మసిస్ట్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి దగ్గర ఘటన.

Gang Leader Trailer: యుద్ధానికి సిద్ధం కండి.. సమర శంఖం నేను ఊదుతా

Nani Gang Leader trailer released, Gang Leader Trailer: యుద్ధానికి సిద్ధం కండి.. సమర శంఖం నేను ఊదుతా

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. నాని 24వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. కొంత కామెడీ, కొంత యాక్షన్, మరికొంత సస్పెన్స్‌తో వచ్చిన ఈ ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ట్రైలర్‌కు అనిరుథ్ అందించిన బ్యాగ్రౌండ్ అదిరిపోయింది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. నాని ‘పెన్సిల్’ అనే రివేంజ్ రైటర్ పాత్రలో నటించాడు. ఇంగ్లీష్ థ్రిల్లర్ సినిమాలను చూసి.. వాటిని తెలుగులోకి తర్జుమా చేసి పుస్తకాలు రాస్తుంటాడు. ఈ క్రమంలో కొంతమందిపై పగ పెంచుకున్న ఐదుగురు ఆడవాళ్లు పెన్సిల్ సహాయం కోరుతారు. ఈ నేపథ్యంలో వారికి నాని ఎలా సహాయం చేశాడు..?ఆ ఐదుగురి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? వారి పగ ఏంటి..? వారికి, విలన్‌కు మధ్య సంబంధం ఏంటి..? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే  సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించగా.. శ్రీలక్ష్మి, శరణ్య పొన్నవన్, ప్రియదర్శి, సత్య, అనీష్ కురివెల్ల తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.