‘గ్యాంగ్ లీడర్‌’గా నాని రాకకు డేట్ ఫిక్స్

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ జూన్‌ 30కు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ విడుదలకు రిలీజ్ డేట్‌ ఫిక్స్ చేశారు నిర్మాతలు. ఆగష్టు 30న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక నటిస్తుండగా.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్‌గా […]

‘గ్యాంగ్ లీడర్‌’గా నాని రాకకు డేట్ ఫిక్స్
Follow us

| Edited By:

Updated on: May 17, 2019 | 1:36 PM

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తోన్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ప్రస్తుతం మూడో షెడ్యూల్‌ను జరుపుకుంటోన్న ఈ చిత్ర షూటింగ్ జూన్‌ 30కు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ విడుదలకు రిలీజ్ డేట్‌ ఫిక్స్ చేశారు నిర్మాతలు. ఆగష్టు 30న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక నటిస్తుండగా.. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. లక్ష్మీ, శరణ్య, అనీశ్ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కివోర్, సత్య తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.