‘సింబా’గా నాని.. ప్రోమో విడుదల

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న మరో అద్భుత చిత్రం ద లయన్ కింగ్. 1994నాటి యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్‌ను ఇప్పటి సాంకేతిక ఉపయోగించి తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుండగా.. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీలో ‘ద లయన్ కింగ్’ సందడి చేయనున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగులో సింబా పాత్రకు నాచురల్ స్టార్ నాని తన వాయిస్‌ను వినిపించాడు. దానికి సంబంధించిన […]

‘సింబా’గా నాని.. ప్రోమో విడుదల
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 09, 2019 | 3:25 PM

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న మరో అద్భుత చిత్రం ద లయన్ కింగ్. 1994నాటి యానిమేషన్ చిత్రం ద లయన్ కింగ్‌ను ఇప్పటి సాంకేతిక ఉపయోగించి తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కానుండగా.. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీలో ‘ద లయన్ కింగ్’ సందడి చేయనున్నాడు. ఈ నేపథ్యంలో తెలుగులో సింబా పాత్రకు నాచురల్ స్టార్ నాని తన వాయిస్‌ను వినిపించాడు. దానికి సంబంధించిన వీడియోను నాని తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి నేను సింబా. ముఫాసా కొడుకును అని నాని కామెంట్ పెట్టాడు. ఇక మిగిలిన పాత్రాధారులకు జగపతి బాబు, రవి శంకర్, బ్రహ్మానందం, అలీ, లిప్సిక తదితరులు తమ వాయిస్‌ను వినిపించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ట్రైలర్‌తో అందరిలో ఆసక్తిని కలిగించిన ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాలు ఉన్నాయి.