Breaking News
  • ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించాం. శేఖర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉంది. బోగీలను క్రేన్‌ సాయంతో ఈ రాత్రికి తొలగిస్తాం -రైల్వే రెస్క్యూ అధికారి భార్గవ్‌
  • విజయవాడ: రేపు ఉ.11:45కు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు. అఖిలప్రియ కుటుంబంపై అక్రమ కేసులు ప్రభుత్వ వేధింపులపై ఫిర్యాదు చేయనున్న టీడీపీ నేతలు
  • నిందితుడు ప్రకాష్‌ భార్య సునీత సంచలన వ్యాఖ్యలు. మా ఆయనకు గతంలో కూడా ఇలాంటి అనుభవం ఉంది. గతంలో మా ఆయనను ఊరి నుంచి తరిమికొట్టారు. మా ఆయన ఎదురైతే నేనే చంపేస్తా-ప్రకాష్ భార్య సునీత ప్రకాష్‌ను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి-సునీత
  • వరంగల్‌: ఫోర్ట్‌ రోడ్డులో కారు బీభత్సం. ఒక ఆటో, 6 బైక్‌లను ఢీకొట్టిన కారు. 8 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ఆర్టికల్ 370రద్దుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి ఆర్టికల్ 370 ఆటంకంగా మారిందన్న కేంద్రం. ఆర్టికల్ 370తో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు ప్రయోజనం పొందారు ఆర్టికల్‌ 370 రద్దుపై ఈ నెల 14న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
  • మహారాష్ట్రలో గవర్నర్‌ సంచలన నిర్ణయం. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాలు. బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్‌-44, ఇతరులు -29 బలనిరూపణ చేసుకోని తొలి రెండు స్థానాల్లో ఉన్న బీజేపీ, శివసేన. మూడో స్థానంలో ఉన్న ఎన్సీపీని ఆహ్వానించిన గవర్నర్‌
  • ప్రకాశం: 2017 భూకుంభకోణంలో రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌. రిటైర్డ్ తహశీల్దార్‌ మెర్సీకుమారి, గుడ్లూరు వీఆర్వో నాగరాజు, ఆపరేటర్‌ సురేష్‌ అరెస్ట్. అక్రమంగా పాస్‌బుక్‌లు పొందిన మరో నలుగురి అరెస్ట్‌, రిమాండ్‌కు తరలింపు

యంగ్‌ హీరోతో నాని ‘హిట్’ కొడతాడా..!?

ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. ఈ నేపథ్యంలో వాల్ పోస్టర్‌ సినిమాను స్థాపించి.. అందులో మొదటి చిత్రంగా ‘అ!’ను తెరకెక్కించాడు. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, మురళీ శర్మ తదితరులు నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రాగా.. రెండు జాతీయ అవార్డులను కూడా సాధించింది. అయితే నానికి మాత్రం ఈ మూవీతో అనుకున్నంత లాభాలు రాలేదు. కాగా ఇప్పుడు నిర్మాతగా రెండో సినిమాకు సిద్ధమయ్యాడు నాని. ‘ఈ నగరానికి ఏమైంది’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ‘ఫలక్‌నుమాదాస్‌’తో అందరినీ ఆకట్టుకున్న విశ్వక్‌సేన్ నాయుడుతో నాని రెండో సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ సినిమా వేడుకలో క్లూను ఇచ్చిన నాని.. ఇప్పుడు అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు ఈ మూవీకి హిట్ అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇక ఈ మూవీ ద్వారా శైలేష్ అనే దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. ఇందులో విశ్వక్‌సేన్ సరసన చి.ల.సౌ ఫేమ్ రుహానీ శర్మ నటిస్తోంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక దీని గురించి నాని సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ‘‘మరో వైవిధ్య కథతో, అద్భుత టాలెంట్‌ ఉన్న నటీనటులతో.. మిమ్మల్ని మెప్పించేందుకు రాబోతున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి’’ అంటూ కామెంట్ పెట్టాడు. మరి యంగ్ హీరోతో నాని ఏ మేరకు ‘హిట్’ కొడతాడో చూడాలి.

ఇదిలా ఉంటే మరోవైపు నాని ప్రస్తుతం మోహన్‌కృష్ణ ఇంద్రగండి దర్శకత్వలో వి చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు హీరోగా కనిపిస్తుండగా.. నాని పాత్రలో నటిస్తున్నాడు. నివేథా థామస్, అదితీరావు హైదారీ హీరోయిన్లుగా కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.