నంది విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు

చిత్తూరు జిల్లా గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. అర్థరాత్రి పురాతన నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

నంది విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు
Follow us

|

Updated on: Sep 28, 2020 | 3:11 PM

చిత్తూరు జిల్లా గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. అర్థరాత్రి పురాతన నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు. గంగాధర నెల్లూరు మండలం అగర మంగళంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయం ఎదుట ఉన్న పురాతన నంది విగ్రహాన్ని శనివారం రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం వెనుకభాగం నుంచి లోనికి ప్రవేశించిన దుండగులు నంది విగ్రహాన్ని పెకలించి గుడి వెనుకకు తీసుకెళ్లి పగులగొట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు కొందరిని గుర్తించినట్లు సమాచారం. మత విద్వేషాలు రెచ్చ గొట్టడమే లక్ష్యంగా కొందరు పథకం ప్రకారం నంది విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.

ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌ స్వయంగా దర్యాప్తు ప్రారంభించారు. గంగాధర నెల్లూరు పోలీసు స్టేషన్‌లో ఆదివారం రాత్రి 3 గంటల పాటు 89 మంది అనుమానితులను విచారించారు. నంది విగ్రహం ధ్వంసం కేసును మూడు బృందాల ద్వారా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. గత కొంత కాలంగా ప్రార్థన మందిరాలపై పథకం ప్రకారం కొందరు దుండగులు దాడులకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, ఆ కోణంలో కూడా విచారణ చేపట్టామని ఎస్పీవో ఈశ్వర్ రెడ్డి చెప్పారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..