రానాకు విలన్‌గా నానా..?

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘విరాట పర్వం 1992’. జూన్ నుంచి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మూవీ యూనిట్ వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో నటీనటులను ఎంపిక చేస్తోన్న దర్శకుడు.. చిత్రంలో ప్రతినాయకుడు పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరిగాయని.. ఇందులో నటించేందుకు నానా ఓకే చెప్పారని సమాచారం. అంతేకాదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట. కాగా ఈ మూవీలో టబు, ప్రియమణిలు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు  వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *