‘ అమేథీలో నమాజ్, ఉజ్జయినిలో పూజలా..?’

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరు అమేథీలోని మసీదుల్లో నమాజ్ చేశారని, ఆ తరువాత మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయంలో పూజలు చేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇదంతా ఓట్ల కోసమేగా అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. (ప్రియాంక గాంధీ..మొదట అమేథీ లో నమాజ్, ఆ తరువాత ఉజ్జయిని వెళ్లి అక్కడి మహాకాళేశ్వరాలయంలో పూజలు చేసిన సంగతి తెలిసిందే). ఇక రాహుల్ […]

' అమేథీలో నమాజ్, ఉజ్జయినిలో పూజలా..?'
Follow us

|

Updated on: May 17, 2019 | 4:49 PM

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఒకరు అమేథీలోని మసీదుల్లో నమాజ్ చేశారని, ఆ తరువాత మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వరాలయంలో పూజలు చేశారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇదంతా ఓట్ల కోసమేగా అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ పేరును ప్రస్తావించకుండా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. (ప్రియాంక గాంధీ..మొదట అమేథీ లో నమాజ్, ఆ తరువాత ఉజ్జయిని వెళ్లి అక్కడి మహాకాళేశ్వరాలయంలో పూజలు చేసిన సంగతి తెలిసిందే). ఇక రాహుల్ గాంధీపై  కూడా స్మృతి ఇరానీ విమర్శల వర్షం కురిపించారు. గత ఏడాది మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు రైతుల రుణ మాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని, కానీ..ఈ రాష్ట్రంలోను, ఆ తరువాత ఛత్తీస్ గడ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఈ హామీని నెరవేర్చలేదని ఆమె ఆరోపించారు. ఇలాంటి పార్టీని మీరు విశ్వసిస్తారా అని ప్రజలను ప్రశ్నించారు. అయితే,, ఎన్నికల సందర్భంలో..ప్రధాని మోదీ వారణాసిలో  తన నామినేషన్ దాఖలు చేయడానికి ముందు అక్కడి కాలభైరవుడి ఆలయంలో పూజలు చేసిన విషయాన్నీ స్మృతి ఇరానీ మరిచిపోయినట్టున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.