ప్రజా సమస్యలు పట్టని 18 మంది సర్పంచులకు నోటీసులు..!

ప్రజా సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన సహించేదిలేదంటున్న తెలంగాణ ప్రభుత్వం.. కనీస వసతులు కల్పించడంలో విఫలమైన గ్రామ సర్పంచులకు నోటీసులు జారీ చేసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 18 మంది సర్పంచులకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు

ప్రజా సమస్యలు పట్టని 18 మంది సర్పంచులకు నోటీసులు..!
Follow us

|

Updated on: Jun 30, 2020 | 9:18 PM

ప్రజా సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన సహించేదిలేదంటున్న తెలంగాణ ప్రభుత్వం.. కనీస వసతులు కల్పించడంలో విఫలమైన గ్రామ సర్పంచులకు నోటీసులు జారీ చేసింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని 18 మంది సర్పంచులకు జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని తుర్కదిన్నే, ఎర్రన్నబావితండా, తీగలపల్లి, నాగులపల్లితండా, విన్నచెర్ల, చంద్రకల్, నారాయణపల్లి, జొన్నలబోగుడ, పర్వతపూర్, తుమ్మలసుగూరు, చౌదర్‌పల్లి, రాంపూర్, మర్రికుంటతండా, సింగవరం, కుడికిల్ల, ఉప్పునూంతల, వెల్టూరు, అయ్యవారిపల్లి గ్రామాల సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అయా గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.